ఊరి బాగు కోసం విజయశాంతి తాపత్రయం.. చివరకు కత్తి పట్టి!

లేడీ అమితాబ్ విజయశాంతి కెమెరా ముందుకొచ్చి 13 ఏళ్ళు గడిచిపోయింది. ఒకప్పుడు దక్షిణాది హీరోయిన్లలో టాప్ హీరోయిన్ గా దూసుకెళ్లిన ఈమె.. అటుపై రాజకీయాల్లో అడుగుపెట్టి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కీలకంగా వ్యవహరించింది. మొన్నటిదాకా రాజకీయ కార్యక్రమాలతోనే బిజీ బిజీగా ఉన్న విజయశాంతి సడెన్‌గా మహేష్ 26 లో నటించనుందని కన్ఫర్మ్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఇన్నేళ్లకు రాములమ్మ కెమెరా ముందుకొస్తోందంటే.. ఖచ్చితంగా తనదైన శైలిలో పాత్ర పరిధి ఉంటే తప్ప అంగీకరించి ఉండదు అని చెప్పుకుంటున్నారు జనం. ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ 26 లో విజయశాంతి పాత్ర ఇదేనంటూ నెట్టింట కొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ వివరాలేంటో చూద్దామా..!

మహేష్ బాబు 26

మహేష్ బాబు 26

మహర్షి సినిమాతో సూపర్ సక్సెస్ ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు.. తన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమాకు 'సరిలేరు నీకెవ్వరు' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. అయితే ఈ సినిమా ద్వారా విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం జనాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఒక్క అనిల్ రావిపూడికే సాధ్యమైంది

ఒక్క అనిల్ రావిపూడికే సాధ్యమైంది

ఒకప్పుడు స్టార్ హీరోలతో సమానంగా పారితోషికాలు తీసుకుని లేడీ సూపర్ స్టార్ గా కీర్తించబడిన విజయశాంతి రీ ఎంట్రీ కోసం చాలా మంది దర్శకులు ట్రై చేశారట. కానీ అది ఒక్క అనిల్ రావిపూడికే సాధ్యం కావడం విశేషం. అయితే విజయశాంతి కోసం ఆయన డిజైన్ చేసిన స్పెషల్ రోల్ మాత్రమే ఆమె ఒప్పుకోవడానికి కారణమైందట. కాగా సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ కావడంతో ఈ రోల్ ఏంటనేది బయటకు తెలియకుండా సస్పెన్స్‌లో ఉంచాలని భావించారట అనిల్ రావిపూడి.

విజయశాంతి రోల్ ఇదే అంటూ..

విజయశాంతి రోల్ ఇదే అంటూ..

కానీ డైరెక్టర్ ఊహించిన దానికి భిన్నంగా విజయశాంతి రోల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. ఈ సినిమాలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా విజయశాంతి కళ్ళు చెదిరే పర్‌ఫార్‌మెన్స్ కనబర్చనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఊరి బాగు కోసం తాపత్రయపడుతూ తప్పనిసరి పరిస్థితుల్లో కత్తి పట్టిన వీర వనితగా విజయశాంతి వెండితెర దర్శనం కలుగనుందని ఫిలింనగర్ టాక్.

 జగపతి బాబుతో విజయశాంతి ఢీ

జగపతి బాబుతో విజయశాంతి ఢీ

మహేష్ 26 కోసం విజయశాంతితో పాటు జగపతిబాబు పాత్ర కూడా ఎంతో పవర్ ఫుల్‌గా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేశారట అనిల్. ఈ మేరకు చిత్రంలో వీరిద్దరి మధ్య షూట్ చేయనున్న కొన్ని సన్నివేశాలు చిత్రానికే తలమానికం అయ్యేలా ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు మహేష్ బాబు కూడా ఆర్మీ ఆఫీసర్‌గా ఓ ప్రత్యేకమైన రోల్ పోషిస్తుండటంతో సెట్స్ పైకి రాకముందే ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటేయడం గమనార్హం.

స్పెషల్ అట్రాక్షన్ రష్మిక మందన్న

స్పెషల్ అట్రాక్షన్ రష్మిక మందన్న

ఇక ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే.. అది ఖచ్చితంగా రష్మిక మందన్న మాత్రమే. ప్రస్తుతం యూత్ ఆడియన్స్‌లో యమ క్రేజ్ ఉన్న ఈ భామ.. మహేష్ బాబుతో రొమాన్స్ చేస్తే చూడాలని కుతూహలంగా ఉన్నారు ప్రేక్షకులు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్, కామెడీ అన్నీ సమపాళ్లలో రంగరించి స్క్రిప్ట్ రెడీ చేశారట అనిల్ రావిపూడి. మరికొద్ది రోజుల్లోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X