చిరంజీవి సోదరిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్.. అప్పుడు రొమాన్స్.. ఇప్పుడేమో ఇలా.!
సుదీర్ఘమైన విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. గతంలో కంటే ఇప్పుడు ఆయన స్పీడుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే రెండు చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన... మరికొన్ని చిత్రాలను లైన్‌లో పెట్టేశారు. లాక్‌డౌన్ పిరియడ్‌లో సైతం ఫ్యూచర్ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆయన త్వరలో చేయబోతున్న భారీ సినిమాలో సీనియర్ హీరోయిన్‌ను తీసుకున్నారని ఓ న్యూస్ లీక్ అయింది. అయితే, ఆ మూవీలో ఆమె చిరంజీవికి సోదరిగా నటిస్తుందట. ఇంతకీ ఎవరా హీరోయిన్.? వివరాల్లోకి వెళితే....

ఒకటి సూపర్ హిట్.. రెండో మూవీ మాత్రం...
‘ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు పలు రికార్డులను బద్దలు కొట్టేసింది. అలాగే, కలెక్షన్ల పరంగానూ రాణించింది. ఇక, దీని తర్వాత వచ్చిన ‘సైరా: నరసింహారెడ్డి' మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మెగా అభిమానులు నిరాశకు లోనయ్యారు.

బడా డైరెక్టర్‌తో మూవీ.. తొలిసారి అలా...
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి... బడా డైరెక్టర్ కొరటాల శివతో ‘ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. దేవాదాయ భూముల ఆక్రమణలపై పోరాడే నక్సలైట్‌గా ఈ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. రామ్ చరణ్‌తో పాటు మ్యాట్నీ మూవీస్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. ఇందులో చరణ్ కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీకి హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది.

ముగ్గురిని లైన్‌లో పెట్టేసిన మెగాస్టార్
‘ఆచార్య' సినిమా షూటింగ్ పూర్తి కాకముందే.. చిరంజీవి తన తదుపరి సినిమాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇటీవల ఓ న్యూస్ ఛానెల్‌లో జరిగిన చిట్‌చాట్‌లో త్వరలోనే తాను యంగ్ డైరెక్టర్లు సుజిత్, బాబీ, మెహర్ రమేష్‌లతో సినిమా చేస్తున్నట్లు తెలిపారు. వీరిలో సుజిత్ తెరకెక్కించేది.. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసీఫర్'కు రీమేక్ కావడం గమనార్హం.

చిరంజీవి సినిమాలో పవన్, వరుణ్ తేజ్
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ‘లూసీఫర్' రీమేక్ స్క్రిప్ట్ వర్క్ ఇటీవలే పూర్తి చేశాడట డైరెక్టర్ సుజిత్. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో పోషించిన ఒరిజినల్ మూవీలో కొందరు ప్రముఖులు నటించారు. అలాగే, ఇందులోనూ పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్ నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, మాతృకలో లేని విధంగా ఇందులో హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందట.

చిరంజీవి సోదరిగా స్టార్ హీరోయిన్ ఫిక్స్
తాజాగా ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం... ఈ సినిమాలో చిరంజీవికి సోదరిగా స్టార్ హీరోయిన్ విజయశాంతి నటించబోతుందట. మలయాళంలో మంజు వారియర్ పోషించిన ప్రియదర్శిని అనే ముఖ్యమైన పాత్రకు ఆమెను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా మొత్తం ట్రావెల్ చేసే ఈ రోల్‌లో రాములమ్మ మెప్పింస్తుందనే టాక్ వినిపిస్తోంది.

అప్పుడు రొమాన్స్... 19 సార్లు కలిశారు
మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్‌లో ఏకంగా 19 సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అందులో ‘సంఘర్షణ', ‘ఛాలెంజ్', ‘కొండవీటి రాజా', ‘పసివాడి ప్రాణం', ‘స్వయంకృషి', ‘యముడికి మొగుడు', ‘అత్తకి యముడు.. అమ్మాయికి మొగుడు', ‘గ్యాంగ్ లీడర్' చిత్రాలు సంచలన విజయాలను నమోదు చేసుకున్నాయి.


Click it and Unblock the Notifications











