For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజమౌళి - మహేశ్ మూవీ స్టోరీ లైన్: రివీల్ చేసిన విజయేంద్రప్రసాద్.. హాలీవుడ్ రేంజ్‌లో అక్కడ షూట్!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ప్రత్యేకమైనవిగా నిలుస్తుంటాయి. ఆ కలయికల కోసమే ప్రేక్షకుల వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వాటిలో దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబో ఒకటి. వీళ్లిద్దరూ కలిసి సినిమా ఎప్పుడు తీస్తారా అని తెలుగు ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ స్టార్‌తో సినిమా చేస్తున్నట్లు గత ఏడాది ప్రకటించాడు జక్కన్న.

  ఆ తర్వాత ఈ ప్రాజెక్టుపై ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే సినిమా కథ గురించి కూడా పలు పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ లైన్ గురించి క్లారిటీ ఇచ్చారు రచయిత విజయేంద్ర ప్రసాద్. ఆ వివరాలు మీకోసం!

  జోష్‌లో మహేశ్ బాబు.. జక్కన్న మాత్రం

  జోష్‌లో మహేశ్ బాబు.. జక్కన్న మాత్రం

  వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం RRR అనే సినిమా చేస్తున్నాడు. దానయ్య నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.

  ప్రకటించిన రాజమౌళి... అప్పుడే కాదులే

  ప్రకటించిన రాజమౌళి... అప్పుడే కాదులే

  ప్రస్తుతం RRR షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్న రాజమౌళి.. మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు లాక్‌డౌన్ సమయంలోనే ప్రకటించాడు. అయితే, ఈ మూవీ రావడానికి చాలా సమయం పడుతుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ గ్యాప్‌లో మహేశ్ ‘సర్కారు వారి పాట'తో పాటు వంశీ పైడిపల్లి, యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో సినిమాలు చేయనున్నాడని తెలుస్తోంది.

   రాజమౌళి తీసుకున్న నిర్ణయం వల్లే ఇలా

  రాజమౌళి తీసుకున్న నిర్ణయం వల్లే ఇలా

  వాస్తవానికి రాజమౌళి సినిమాలు అంటే దాదాపు రెండు మూడేళ్ల సమయం పడుతోంది. ఇప్పటికే RRR మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై రెండున్నరేళ్లకు పైగానే అవుతోంది. దీంతో ఈ సినిమా విడుదల తర్వాత ఆయన చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకోనున్నాడట. ఈ విషయాన్ని మహేశ్ బాబుకు కూడా చెప్పాడని.. అందుకే అతడు మరో రెండు చిత్రాలక కమిట్ అయ్యాడని టాక్.

  ఆ మూవీ పనిలోనే విజయేంద్ర ప్రసాద్ బిజీ

  ఆ మూవీ పనిలోనే విజయేంద్ర ప్రసాద్ బిజీ

  సూపర్ స్టార్ మహేశ్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. వాటిని అందుకునేందుకు అదిరిపోయే స్క్రిప్ట్‌తో రావాలని వీళ్లిద్దరూ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే స్టోరీ బాధ్యతలను తన తండ్రి, సీనియర్ రైటర్ విజయేంద్రప్రసాద్‌కు అప్పగించాడు జక్కన్న. ఇప్పటికే కొన్ని స్టోరీ లైన్లను కూడా ఆయన సిద్ధం చేశారని ఆ మధ్య ప్రచారం జరిగింది.

  రెండు రకాల ప్రచారం.. రెండూ హాట్ టాపిక్కే

  రెండు రకాల ప్రచారం.. రెండూ హాట్ టాపిక్కే

  రాజమౌళి - మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా విషయంలో పలు ఊహాగానాలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ చిత్రం మల్టీస్టారర్‌గా రాబోతుందని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఈ మధ్య ఈ భారీ చిత్రాన్ని ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నారని అన్నారు. ఇందులో మహేశ్ టైటిల్ రోల్ చేస్తాడనే టాక్ వచ్చింది.

  విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ.. హాలీవుడ్ రేంజ్‌లో

  విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ.. హాలీవుడ్ రేంజ్‌లో

  ఈ సినిమా గురించి రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఓ హింట్ ఇచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రం ఆఫ్రికన్ అడవుల బ్యాగ్‌డ్రాప్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన రివీల్ చేశారు. అంతేకాదు, హాలీవుడ్‌ రేంజ్‌లో అమెజాన్ ఫారెస్టులో దీన్ని చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.

  English summary
  SS Rajamouli confirms film with Mahesh Babu. Produced by KL Narayana, the film will go on the floors in 2022 after Rajamouli completes 'RRR'. Here's some good news for all Mahesh Babu fans. Director SS Rajamouli, in a recent interview had revealed that he will be collaborating with the star for a movie soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X