బాహుబలి రచయితతో నాగ చైతన్య.. నాగార్జున కోరిక మేరకు!

అక్కినేని నాగ చైతన్య కెరీర్ ఒడిదుడుకుల్లో ఉంది. నాగ చైతన్య నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరిగా రాణించడం లేదు. రియల్ లైఫ్ కపుల్స్ సమంత, చైతు ఓ కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. నాగ చైతన్య సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడప్పుడూ ఓ విజయం దక్కుతున్నా అది కెరీర్ కు ఉపయోగపడడం లేదు. దీనితో నాగ చైతన్య కెరీర్ పై నాగార్జున సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. చైతు తదుపరి చిత్రం గురించి వస్తున్న వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి.

 ఆ రెండు చిత్రాలతో జోష్

ఆ రెండు చిత్రాలతో జోష్

నాగ చైతన్య ప్రేమ కథలు చేసిన ప్రతి సారి మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. చైతుకు తొలి హిట్ దక్కింది కూడా ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఏ మాయ చేసావేతోనే. ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలు విజయాలు సాధించడంతో చైతు కెరీర్ లో జోష్ పెరింది. నాగ చైతన్య కెరీర్ లో వేగం పుంజుకుంది అని భావించిన తరుణంలో మళ్ళీ పరాజయాలు ఎదురయ్యాయి.

 యాక్షన్ బాట

యాక్షన్ బాట

నాగ చైతన్య ఇటీవల తనకు అచ్చిరాని యాక్షన్ చిత్రాలతోనే ప్రయోగాలు చేస్తున్నాడు. యుద్ధం శరణం, సవ్యసాచి చిత్రాలు నిరాశపరిచాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం ఆకట్టుకోలేక పోయింది. దీనితో నాగ చైతన్య తదుపరి చిత్రాలపై సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకటం చైతు కోసం నాగార్జున రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

బాహుబలి రచయిత

బాహుబలి రచయిత

నాగార్జునకు, బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. విజయేంద్ర ప్రసాద్ దర్శత్వంలో నాగార్జున రాజన్న చిత్రంలో నటించారు. నాగ చైతన్య కోసం ఓ కథ సిద్ధం చేయమని విజయేంద్ర ప్రసాద్ ని నాగార్జున కోరినట్లు తెలుస్తోంది. దీనితో చైతు కోసం మంచి యాక్షన్ కథని సిద్ధం చేసే పనిలో విజయేంద్ర ప్రసాద్ ఉన్నారట.

చైతు బాడీలాంగ్వేజ్‌కు తగ్గట్లుగా

చైతు బాడీలాంగ్వేజ్‌కు తగ్గట్లుగా

నాగ చైతన్య శైలికి సరిపోయేలా యాక్షన్, ఎమోషన్ కలగలిపి ఉండే కథ విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరి వహిస్తారో మరికొద్దిరోజుల్లో తేలనుంది. నాగ చైతన్య, సమంత జంటగా నటిస్తున్న మజిలీ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. వివాహం జరిగిన తరువాత చైతు, సమంత తొలిసారి జంటగా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X