సీఎం విజయ్ సినిమాకి భారీ డిమాండ్.. జన నాయగన్ విడుదల ఎప్పుడంటే?

తమిళ సినీ, రాజకీయ రంగాల్లో ప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్‌గా మారిన పేరు విజయ్ దళపతి (Vijay). ఒకవైపు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్.. మరోవైపు తన చివరి సినిమా జన నాయగన్ (Jana Nayagan) విడుదల కోసం అభిమానులను ఆసక్తిగా ఎదురుచూడేలా చేస్తున్నారు. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెడుతూ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న విజయ్ నటించిన ఆఖరి సినిమా కావడంతో 'జన నాయగన్'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా విడుదలపై అనేక రూమర్స్, సెన్సార్ సమస్యలు, ఓటీటీ డీల్ క్యాన్సిల్ వార్తలు వైరల్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ చుట్టూ మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

మొదటగా ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఫ్రైమ్ వీడియో (Amazon Prime Video)భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రకటించిన సమయానికి సినిమా విడుదల కాకపోవడం, సెన్సార్ సమస్యలు తలెత్తడం వల్ల ఆ డీల్ మధ్యలోనే నిలిచిపోయిందని కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో అభిమానుల్లో కూడా అనుమానాలు మొదలయ్యాయి. "సినిమా అసలు వస్తుందా? లేక నిలిచిపోతుందా?" అనే సందేహాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Vijay s Jana Nayagan OTT Deal Back in Buzz Release Date Rumours

అయితే.. ఒక్కసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 'జన నాయగన్'కు ఒక్కసారిగా గ్లోబల్ లెవెల్ హైప్ పెరిగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నటించిన చివరి సినిమా అనే ట్యాగ్ రావడంతో డిజిటల్ మార్కెట్‌లో ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ మళ్లీ మూవీ నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్టన్స్ (KVN Productions) తో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. విజయ్ రాజకీయ ఇమేజ్, ప్రపంచవ్యాప్త ఫ్యాన్ బేస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారి మరింత భారీ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది.

దర్శకుడు హెచ్. వినోథ్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ మాస్ యాక్షన్ డ్రామాలో విజయ్ సరసన పూజ హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తుండగా, విలన్ పాత్రలో బాబీ డియోల్ (Bobby Deol) కనిపించనున్నారు. ఈ సినిమా కథ కూడా విజయ్ నిజ జీవితం, రాజకీయ ప్రయాణానికి దగ్గరగా ఉంటుందని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. సాధారణ వ్యక్తి ప్రజానాయకుడిగా ఎలా ఎదిగాడు? అనే అంశాన్ని బలమైన ఎమోషన్స్, రాజకీయ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించినట్లు సమాచారం. అందుకే 'జన నాయగన్' అనే టైటిల్‌కే ఇప్పుడు ప్రత్యేకమైన రాజకీయ అర్థం వస్తోంది.

ఇక ఈ సినిమా సెన్సార్ వ్యవహారం కూడా పెద్ద చర్చకు దారితీసింది. కొన్ని రాజకీయ అంశాలు, సంభాషణల కారణంగా సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వివాదం న్యాయస్థానాల వరకు వెళ్లడంతో ప్రత్యేక రివైజింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆ కమిటీ రిపోర్ట్ కోసం మేకర్స్ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ క్లియరెన్స్ రాగానే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

ఇటీవల చెన్నైలో జరిగిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత కేవీఎన్ మీడియాతో మాట్లాడుతూ.. "ఇప్పుడు విజయ్ కేవలం సినిమా హీరో కాదు.. తమిళనాడు జన నాయగన్ అయ్యారు. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్నాం. అది వచ్చిన వెంటనే విడుదల చేస్తాం" అని వ్యాఖ్యానించడం వైరల్ అయింది. ఈ వ్యాఖ్యలతో సినిమా విడుదల ఖాయమనే నమ్మకం అభిమానుల్లో మరింత పెరిగింది.

సినీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. జన నాయగన్ సినిమాను 2026 జూన్ 19న విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. లేదా జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ టీజర్, పోస్టర్ లేదా థ్యాంక్యూ వీడియో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇలా 'జన నాయగన్' ఇప్పుడు కేవలం సినిమా మాత్రమే కాదు.. ఒక స్టార్ హీరో సినీ ప్రయాణానికి ముగింపు, రాజకీయ ప్రయాణానికి ప్రారంభ సూచికగా మారిపోయింది. ఓటీటీ డీల్, సెన్సార్ క్లియరెన్స్, రిలీజ్ డేట్.. ఇలా ప్రతి చిన్న అప్‌డేట్ ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా ట్రెండింగ్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X