Ponniyin Selvan 1: హాట్ టాపిక్ గా తారల పారితోషికం.. విక్రమ్ కు అంతా!.. త్రిషకు ఇంతే?
స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్. పార్ట్ 1గా వస్తున్న ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి వంటి తదితర అగ్ర తారలు నటించారు. వారిలో బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఐశ్వర్య రాయ్, త్రిష ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పోస్టర్లు, ఫస్ట్ లుక్, ట్రైలర్లతో అంచనాలు పెంచిన ఈ చిత్రం గ్రాండ్ గా ఇవాళ అంటే సెప్టెంబర్ 30న విడుదలైంది. అయితే అతిపెద్ద తారాగణంతో వచ్చిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన తారల పారితోషికం వార్తలు చక్కర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

భారీ తారాగణం..
రొమాంటిక్ లవ్ స్టోరీస్ మూవీస్ డైరెక్టర్ గా పేరొందిన మణిరత్నం తెరకెక్కించిన చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. ఇందులో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది స్టార్లు నటించారు. ఈ సినిమాను మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య సంయుక్తంగా నిర్మించారు. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

తమిళ బాహుబలిగా పేరు..
తమిళ బాహుబలిగా పేరు తెచ్చుకున్న 'పొన్నియన్ సెల్వన్' మూవీ పిరియాడిక్ యాక్షన్‌తో రూపొందింది. దీంతో దీనిపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైన మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీగా వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా భారీ బజ్ ఏర్పడింది.

కల్కి కృష్ణమూర్తి రచించిన..
కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. చారిత్రాత్మక చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్, పోస్టర్లు, ఫస్ట్ లుక్ లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల సెప్టెంబర్ 23న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.

రూ. 65 కోట్ల వరకూ బిజినెస్..
'పొన్నియన్ సెల్వన్' మూవీకి తమిళంలో దాదాపు రూ. 65 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా మొత్తంగా దీనికి రూ. 130 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక, అన్ని చోట్లా ఇది గ్రాండ్‌గా విడుదలైంది.

మిక్స్ డ్ టాక్ తో..
భారి అంచనాల మధ్య సెప్టెంబర్ 30న విడుదలైన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 చిత్రం మిక్స్ డ్ టాక్ తో దూసుపోతోంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రంలో నటించిన ప్రధాన తారల పారితోషికం వివరాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ వివరాలను పలు తమిళ వెబ్ సైట్ లు వెల్లడించినట్లు తెలుస్తోంది.

పాత్ర కారణంగా ఎక్కువ పారితోషికం
పలు తమిళ వెబ్ సైట్ ల వివరాల ప్రకారం ఈ చిత్రం కోసం చియాన్ విక్రమ్ రూ. 12 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అలాగే బ్యూటిఫుల్ ఐశ్వర్య రాయ్ రూ. 10 కోట్లు, జయం రవి రూ. 8 కోట్లు, కార్తి రూ. 5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక త్రిష వీరందరి కన్నా తక్కువ రూ. 2.5 కోట్ల రెమ్యునరేషన్ అందుకుని సమచారం. అంతేకాకుండా జయం రవి కంటే కార్తికి ఎక్కవ క్రేజ్ ఉన్నప్పటికీ చిత్రంలో జయం రవి పాత్ర కారణంగా ఎక్కువ పారితోషికం ఇచ్చినట్లు టాక్.


Click it and Unblock the Notifications











