శంకర్ ‘ఐ’: విక్రమ్-అమీ జాక్స్ లిప్‌లాక్?
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రస్తుతం 'ఐ' అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా చేస్తోంది. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ జోధ్‌పూర్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అందిన ఆసక్తికర విషయం ఏమిటంటే ఈచిత్రంలో విక్రమ్-అమీ జాక్సన్ మధ్య లిప్ లాక్ సీన్ ఉందట.
ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక షూటింగ్ స్పాట్లో ఇందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది. అయితే దర్శకుడి నుంచి గానీ, చిత్ర యూనిట్ సభ్యుల నుంచి గానీ లిప్ లాక్ సీన్ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరి ఈ విషయం అధికారికంగా వెల్లడయితే తప్ప సినిమాలో ఆ సీన్ ఉందనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
ఈ చిత్రానికి పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'హారీపొటర్' చిత్రానికి పనిచేసిన ఆస్ట్రేలియన్ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్స్‌ని అందిస్తోంది. 'మెన్ ఇన్ బ్లాక్ ' లాంటి హాలీవుడ్ చిత్రానికి పనిచేసిన మారీ ఓగ్ట్ ఈ చిత్రానికి కాస్టూమ్స్ డిజైనర్‌గా సేవలందించనున్నాడు.
చైనాకు చెందిన ఫైట్‌మాస్టర్ పీటర్ మింగ్ ఈ చిత్రానికి పోరాట దృశ్యాలని సమకూర్చనున్నాడు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో శంకర్, విక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అపరిచితుడు చిత్రం కమర్షియల్‌గా సూపర్‌హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











