ిక్రమ్ తో ఎస్.ఎస్.రాజమౌళి!?
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గ్రహీత విక్రమ్, కమిర్షియల్ చిత్రాల దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ చిత్రం రానుందనే వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అందుకోసం ఓ భారీ సబ్జెకుటును సైతం రాజమౌళి రెడీ చేస్తున్నట్లు సమాచారం. విక్రమ్ ఇమేజ్ కి తగ్గకుండా తమిళ, తెలుగు ప్రేక్షకులు అభిరుచులకు అణుగుణంగా సబ్జెక్టు వంటకం జరుగుతోందని వినికిడి. ఇక విక్రమ్ సైతం మల్లన్న పరాజయం అనంతరం తనని భారీ స్ధాయిలో ప్రాజెక్టు చేసే దర్శకుడు కోసం వెతుకుతూ రాజమౌళి వద్ద ఆగినట్లు చెప్తున్నారు. శంకర్ తో చేసిన అపరిచితుడు రేంజిలోనే ఓ సామాజిక సందేశాన్ని ముడిపెడుతూ కథనం సాగాలని విక్రమ్ స్ఫష్టంగా చెప్పారని అంటున్నారు. అలాగే రాజమౌళి డైరక్ట్ చేసిన చిత్రాలు కూడా ఆయన చూసి సంతృప్తి వ్యక్తం చేసారట. అన్నీ సక్రమంగా కలిస్తే రాజమౌళి, విక్రమ్ కాంబినేషన్ ఫిల్మ్ రావట కష్టమేమీ కాదు.
విక్రమ్ రాజమౌళి సింహాద్రి మగధీర అపరిచితుడు శివపుత్రుడు మల్లన్న సుశిగణేషన్ శ్రియ vikram rajamouli magadheera aparichitudu mallanna simhadri maja


Click it and Unblock the Notifications