విలన్ ‘వేడి’ నుండి ఇలియాన ప్రక్కకు నెట్టేస్తున్నాడు
'రావణ్" ప్లాప్ అవ్వడంతో విక్రమ్ చాలా బాధపడుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కి దాదాపు సంవత్సరన్నర పట్టింది. అంతకుముందు చేసిన 'మల్లన్న", దానికిముందు 'భీమ" కూడా యేళ్ళ తరబడి షూటింగ్ లు జరుపుకున్నాయి. దానివల్ల విక్రమ్ ఖాతాలో సినిమాల సంఖ్య తగ్గింది. ఇక నుంచి అలా జరగకూడదని, తను సినిమా చేసినా తను ఏ సినిమా చేసినా త్వరగా పూర్తయ్యేలా చూసుకోవాలని విక్రమ్ అనుకుంటున్నాడు. ప్రస్తుతం అతను భూపతి పాండియన్ దర్శకత్వంలో 'వేడి" అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో విక్రమ్ పక్కన ఇలియానా కథానాయికగా నటిస్తోంది. తను సరిగ్గా డేట్స్ అడ్జెస్ట్ చేయడంలేదట. ఇలా అయితే సినిమా లేట్ అవుతుందని భావించిన విక్రమ్ ఆమె స్థానంలో వేరే కథానాయికను ఎన్నుకోవాలనుకుంటున్నాడట.
ఇలియానా విక్రమ్ వేడి భూపతి పాండియన్ రావణ్ ఐశ్వర్య రాయ్ మల్లన్న భీమ ileana vikram vedi boopathy pandian aishwarya rai mallanna bheema


Click it and Unblock the Notifications