Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలకృష్ణ, రాజశేఖర్ మల్టీస్టారర్.. బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్!
Recommended Video
నందమూరి బాలకృష్ణకు ఈ ఏడాది నిరాశాజనకంగా మొదలయింది. ఎంతో ఇష్టపడి చేసిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు దారుణంగా నిరాశ పరిచాయి. ప్రస్తుతం బాలకృష్ణ ఎన్నికల హడావిడిలో ఉన్నాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత తన కొత్త చిత్రాలపై దృష్టి పెడతాడు. ముందుగా బాలయ్య బోయపాటి దర్శత్వంలో నటించాల్సి ఉంది. వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా బాలయ్య ఓ క్రేజీ మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.
బ్లాక్ బస్టర్ మూవీ
తమిళ హీరోలు మాధవన్, విజయ్ సేతుపతి కలసి నటించిన విక్రమ్ వేద చిత్రం 2017లో విడుదలై ఘనవిజయం సాధించింది. పుష్కర్, గాయత్రి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మంచి వసూళ్లు సాధించడమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కించుకుంది. మాధవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, విజయ్ సేతుపతి రౌడీగా కనిపించాడు. ఓ తెలుగు నిర్మాత ఈ చిత్ర రీమేక్ హక్కులని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మల్టీస్టారర్‌కు ప్లానింగ్
విక్రమ్ వేద రీమేక్ హక్కులని సొంతం చేసుకున్న ఆ నిర్మాత ప్రస్తుతం ఇద్దరు హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య, రాజశేఖర్ ని కలసి తన ఆలోచన వివరించారట. ప్రస్తుతం వీరి మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ఒకే చేస్తే ఈ క్రేజీ మల్టీస్టారర్ పట్టాలెక్కడం ఖాయం.
ఆ రెండు చిత్రాలు పూర్తయితే
ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాల హవా కొనసాగుతోంది. విక్రమ్ వేద కథ ఒక మంచి దర్శకుడి చేతిలో పడితే తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎన్నికల హడావిడిలో బిజీగా గడుపుతున్న బాలయ్య ఇప్పుడే తన నిర్ణయాన్ని ప్రకటించకపోవచ్చు. ఒకవేళ ఈ చిత్రం ఒకే అయినా ముందు బాలయ్య బోయపాటి చిత్రం పూర్తి చేయాల్సి ఉంటుంది. మరోవైపు రాజశేఖర్ కల్కి చిత్రం పూర్తి కావాలి. ఇందంతా జరగలాంటి ఈ ఏడాది చివరి వరకు ఆగాల్సిందే.
బోయపాటి దర్శత్వంలో
ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల రిజల్ట్ తో బాలయ్య నిరాశలో ఉన్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. వీటన్నింటి నుంచి బయట పడాలంటే బాలయ్య త్వరగా ఓ కమర్షియల్ హిట్ కావాలి. బోయపాటి దర్శత్వంలో తెరకెక్కే చిత్రం వీరి కాబినేషన్ లో హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.