twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ ‘విక్రమార్కుడు’ సీక్వెల్‌గా ‘జింతాతా’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'విక్రమార్కుడు' చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. రవితేజకు మాస్ హీరోగా పేరు తెచ్చిన సినిమా అది. ఈ చిత్రంలో అనుష్క అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే. అన్ని కమర్షియల్ అంశాలతో ప్రేక్షక రంజకంగా రూపొందిన ఈ చిత్రం...తమిళం, కన్నడ, హిందీలో కూడా రీమేక్ అయి సంచలన విజయం సాధించింది. ఇటీవల అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా జంటగా హీందీలో 'రౌడీ రాథోడ్'గా రీమేక్ అయిన ఈచిత్రం భారీ కలెక్షన్లు కురిపించింది కూడా.

    తాజా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న ఆసక్తికర వార్త ఏమిటంటే....'విక్రమార్కుడు' చిత్రానికి సీక్వెల్‌ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'జింతాతా' అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. విక్రమార్కుడు సినిమాలో జింతాతా మేనరిజం బాగా ఫేమస్ అయిన నేపథ్యంలో సీక్వెల్ కి అదే టైటిల్ పెడితే మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ప్రభాస్‌తో సినిమా అయి పోయిన తర్వాత రాజమౌళి ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నాడని, ఈగ నిర్మాత సాయి కొర్రపాటి ఈచిత్రాన్ని నిర్మించనున్నట్లు చర్చించుకుంటున్నారు.

    ఇటీవల విడుదలైన నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు సినిమాలతో పరాజయం చవి చూసిన రవితేజ ప్రస్తుతం 'సార్ వచ్చారు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. అదే విధంగా 'బలుపు' అనే మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ పొట్లూరి నిర్మించనున్న 'బలుపు' చిత్రం షూటింగుకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్లో ఈచిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా సెలక్ట్ అయింది. సంగీత దర్శకడు తమన్ ఈ చిత్రానికి సూపర్ హిట్ ఆడియో అందించేందుకు కృషి చేస్తున్నాడు.

    English summary
    One of the biggest blockbusters in the history of Tollywood is ‘Vikramarkudu’. Now, it is heard that plans have begun to make a sequel to the film and this has been titled as ‘Jinthatha..’. Sources say this would be produced by Sai Korrapati of ‘Eega’ fame. It is heard that Sai is close friends with the tough taskmaster S S Rajamouli who directed ‘Vikramarkudu’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X