కారవ్యాన్ లో క్యారెక్టర్ భామలతో శృంగారం ఒలకబోస్తూ దోరికిపోయిన డైరెక్టర్
టాలీవుడ్ లోకి లాయర్ గా ప్రవేశించి అటుతర్వాత తన విలన్ నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు జివి సుధాకర్ నాయుడు. జివి సుధాకర్ నాయుడు కంటే కూడా యావత్ తెలుగు పరిశ్రమకు జివిగా బాగా సుపరిచితం. విలక్షణమైన విలనిజం ఆయన సొంతం. మొట్టమొదట విలన్ గాప్రారంభమైనప్పటికీ కూడా తర్వాత కాలంలో తనలోని దర్శకుడుని బయటకు తీశారు. ప్రస్తుతం శ్రీకాంత్ తో రంగ ది దొంగ లాంటి సినిమా తీశారు. ఈసినిమాలో హీరోగా శ్రీకాంత్ డబుల్ రోల్ చేయగా, హీరోయిన్ గా విమల రామన్ నటించారు.
విలన్ గా పరభాషా చిత్రాల వారిని తీసుకొస్తున్న తరుణంలో మన తెలుగులో విలన్స్ లేరా అంటూ తనదైన శైలిలో చక్కగా మాట్లాడినా, పరభాషా నటీమణులు వస్తే మాత్రం వారితో రోమాన్స్ చేయడానికి ఎగబాడతాడని ఇండస్ట్రీ టాక్. ఈయన డైరెక్షన్‌లో క్యారెక్టర్ భామలు వుంటే తన కారవాన్‌లో సరసాలు సాగిస్తాడట. జివీకి ఇండస్ట్రీలో పలుకుబడి కూడా బాగానే ఉండటంతో ఆయన ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోందని సమాచారం. కాసేపు ఈయనకి సహకరిస్తే అవకాశాలు ఇప్పిస్తాడని చాలామంది తారలు ఇష్టం లేకపోయినా సహకరిస్తున్నారని ఫిలిం వర్గాల సమాచారం.
షూటింగ్ స్పాట్ లో పబ్లిక్ గా ఇలాంటివి జరుగుతున్నా నిర్మాతలు చూసీ చూడనట్టు పోతున్నట్లు సినీజనం గుసగుసలుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా రంగ ది దొంగ చిత్రానికి దర్శకత్వం వహించి ఆడియోని కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆడియోకి కూడా మంచి స్పందన రావడంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అంటూ శ్రీకాంత్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఐతే ఈ చిత్రానికి థియేటర్ దొరక్క బాక్స్‌లు ల్యాబ్‌లో మూలుగుతున్నాయని సినీవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











