twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రోలింగ్ ఎఫెక్ట్: ‘వినయ విధేయ రామ’ నుంచి ఆ సీన్లు లేపేస్తున్నారా?

    |

    రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' చిత్రం భారీ అంచనాలతో వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. 'రంగస్థలం' లాంటి విజయం తర్వాత వస్తున్న సినిమా కావడం, బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలమైంది.

    ఈ మాస్ యాక్షన్ ఎంటర్టెనర్ సంక్రాంతికి విజేతగా నిలుస్తుందని భావించిన అందరి అంచనాలు తలక్రిందులయ్యాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టినా కథ పరంగా, సినిమాను తెరకెక్కించిన విధానం పరంగా దర్శకుడు విఫలం అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    సినిమాలోని సీన్లపై ట్రోలింగ్

    సినిమాలోని సీన్లపై ట్రోలింగ్

    అయితే ఈ చిత్రంలో కొన్ని సీన్లపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. దర్శకుడు బోయపాటి కొన్ని సీన్లు మరీ ఓవర్‌గా ప్రజంట్ చేశారని, ముఖ్యంగా క్లైమాక్స్‌లో విలన్ వివేక్ ఒబెరాయ్ పాముతో ఓ పిల్లాడిని బెదిరించడం, ఆ పాము విలన్‌ను కాటేసి చివరకు అదే చచ్చిపోవడం లాంటి సీన్లు యాక్సెప్టబుల్‌గా లేవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    ఈ సీన్లు లేపేస్తున్నారా?

    ఈ సీన్లు లేపేస్తున్నారా?

    ఈ పాము కాటు సీన్‌తో పాటు ట్రైన్ సీన్, మరికొన్నిఓవర్ లాజిక్ లెస్ సీన్లను తొలగించాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటిని తొలగించడం ద్వారా ఎంతో కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చిత్ర బృందం భావిస్తోందట.

    రామ్ చరణ్ కష్టం, భారీ బడ్జెట్

    రామ్ చరణ్ కష్టం, భారీ బడ్జెట్

    ఈ సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు. భారీగా కండలు పెంచాడు. నిర్మాత డివివి దానయ్య కూడా వెనకముందు ఆలోచించకుండా భారీగా ఖర్చు పెట్టారు. ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో హై బడ్జెట్ మూవీ ఇదే. అఫ్ కోర్స్ దర్శకుడు బోయపాటి అంతకంటే ఎక్కువ కష్టపడ్డప్పటికీ ప్రేక్షకులను మెప్పించే ప్రొడక్ట్ అందించడంలో విఫలం అయ్యారు.

    రామ్ చరణ్ మూవీ తీసేసి.. ఎఫ్ 2, పేటకు థియేటర్లు

    రామ్ చరణ్ మూవీ తీసేసి.. ఎఫ్ 2, పేటకు థియేటర్లు

    ‘వినయ విధేయ రామ' చిత్రానికి అంతగా ఆదరణ లేక పోవడంతో కొన్ని థియేటర్ల నుంచి ఈ చిత్రాన్ని లేపేసి... ఆ స్థానంలో ఎఫ్ 2, పేట చిత్రాలు ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారట. 2019 సంవత్సరం ప్రారంభంలోనే ఇలాంటి దెబ్బ తగలడం మెగా అభిమానులను సైతం బాధిస్తోంది.

    English summary
    Film nagar source said that, Vinaya Vidheya Rama makers have chopped off a few scenes from the movie. During the climax scene, a villain threatens a small kid with a snake. The same snake bites the villain and dies. Now that scene has become a talking point on social media with audiences wondering how the snake could die.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X