ఆ మాస్ డైరక్టర్ తో పవన్?
మాస్ లో మంచి ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ మరో మాస్ మసాలా దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో చేయబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న అదుర్స్ అనంతరం వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని రూపొందించటానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మొదట అల్లు అర్జున్ తో చిత్రం చేద్దామనుకున్న వినాయక్ డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రాజెక్టు మాత్రం కాన్సిల్ కాలేదని చెప్తున్నారు. అందులోనూ పవన్ తన పులి చిత్రం అనంతరం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. అయితే రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర,గోలీమార్ చిత్రాలు కమిట్ కావటంతో వినాయక్ కి డేట్స్ ఇవ్వటానికి పవన్ అంగీకరించారని తెలుస్తోంది. ఈ విషయమై వినాయక్ సైతం మంచి ఉత్సాహంగా, కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటికే లైన్ విన్పించిన ఆయన పూర్తి స్క్రిప్టు తో పవన్ ని మెప్పించాలని కృషి చేస్తున్నారు. అలాగే ఆ చిత్రం కృష్ణ తరహాలో పూర్తి ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టును గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. జల్సా అనంతరం పవన్ తో చేస్తున్న సినిమా కావటంతో ఖర్చుకి వెనకాడకుండా మంచి హిట్ ఇవ్వమని అల్లు అరవింద్ చెప్పినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











