బెల్లం.. కొడుకు మూవీకి వినాయక్ భారీ రెమ్యూనరేషన్?
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన వివి వినాయక్ ఈచిత్రానికి దర్శకుడు. తాజాగా ఈచిత్రానికి వినాయక్ తీసుకునే రెమ్యూనరేషన్ చర్చనీయాంశం అయింది.
ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి వినాయక్ అత్యంత ఎక్కువ మొత్తంలో రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్ల సమాచారం. అదే విధంగా తన కొడుకు సరసన సమంతను హీరోయిన్ గా ఒప్పించడానికి కూడా ఆమెకు హారీ మొత్తంలోనే ఆఫర్ చేసాడట బెల్లంకొండ. కొడుకు సినిమా కాబట్టి వెనకా ముందు ఆలోచించకుండా బెల్లంకొండ తెగ ఖర్చు పెడుతున్నాడని వినికిడి.
గత నెలలో ఈచిత్రం ప్రారంభోత్సవం చాలా గ్రాండ్ గా జరిగింది. దర్శక రత్న దాసరి నారాయణరావు తొలిసన్నివేశానికి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్ బాబు శ్రీలక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 4గా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.
vv vinayak samantha bellamkonda srinivas bellamkonda suresh సమంత వివి వినాయక్ బెల్లంకొండ శ్రీనివాస్ బెల్లంకొండ సురేష్


Click it and Unblock the Notifications
