చిరు ప్రకటనతో అప్ సెట్ అయిన మెగా డైరెక్టర్...!

By Sindhu

ఇటీవల 'ఇక సినిమాలలో నటించను' అంటూ శపథం చేసి... అబిమానులూ, అమితాబూ 'లేదు... మళ్లీ నటించాలీ' అంటూ బ్రతిమిలాడడంతో, మెగాస్టార్ చిరంజీవి ఆ మర్నాడే మళ్లీ తన నిర్ణయాన్ని మార్చేసుకోవడంతో...అంతా 'హమ్మయ్య' అంటూ ఊపిరిపీల్చుకున్నారు. అంతేకాదు, 'నా 150 వ సినిమాకి పూరీ జగన్నాథ్ దర్శకుడు' అంటూ ఆయన డిక్లేర్ చేసేయడంతో, పూరీతో సహా అంతా ఆనందపడిపోయారు. అయితే, టాలీవుడ్ లోని ఒక్క వ్యక్తి మాత్రం తెగ అప్ సెట్ అయ్యాడని అంటున్నారు. అదేవరంటే... దర్శకుడు వినాయక్..!

ఎందుకంటే, చిరు నటించే 150 వ సినిమాకి వినాయకే దర్శకుడని ఇప్పటికే ప్రచారం జరిగిపోయింది. తను కూడా రెండు మూడుసార్లు 'చిరంజీవి గారి సినిమా నేనే డైరెక్ట్ చేస్తున్నాను' అంటూ ప్రకటించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇలా 'ఆ సినిమాకి పూరీ దర్శకుడంటూ' స్వయానా చిరంజీవే ప్రకటించడంతో, వినాయక్ బాగా హర్ట్ అయ్యాడని అతని సన్నిహితులు అంటున్నారు. ఓ పక్క బద్రీనాథ్ ఫ్లాప్... మరోపక్క చిరు ప్రకటన.. రెండూ వినాయక్ ని చాలా డిజప్పాయింట్ చేశాయట..!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X