11 .11 .11 ఫ్యాన్సీ డేట్ కోసం ఐశ్వర్య కు సిజేరియన్..?
అందాల సుందరి ఐశ్వర్యరాయ్ ప్రస్తుతం ఐష్ గర్భవతి అన్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ ఆమె నటించిన సినిమాలు గురించిన మాట్లాడుకున్నవాళ్లు ఇప్పుడు ఆమె జన్మనివ్వబోతున్న బిడ్డ గురించి చర్చించుకుంటున్నారు. బచ్చన్ కుటుంబం మాత్రం తమ కుటుంబం జాబితాలో చేరబోయే బిడ్డ కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. అమితాబచ్చన్, ఆయన సతీమణి జయాబచ్చన్ తమ కోడల్ని అపురూపంగా చూసుకుంటున్నారట.
ఈ నెల 11న ఆమె బిడ్డకు జన్మనిస్తే.. 11.11.11 అవుతుంది కాబట్టి అదే రోజు బచ్చన్ ఇంటివారు శుభవార్త వింటారని కొంతమంది బెట్ కట్టారు. బాలల దినోత్సవం నాడు (నవంబర్, 14) ఐష్‌కి డెలివరీ అవుతుందన్నది కొంతమంది బెట్టింగులు కట్టిన విషయం విధితమే ఇదిలా ఉండంగా...
ఈ నెల రెండో వారంలో ఐశ్వర్య రాయ్ కు డెలివరీ కాబోతోంది. ఇందుకోసం బచ్చన్ కుటుంబం ముంబాయ్ లోని అంథేరిలో గల 7హిల్స్ హిస్పిటల్ విఐపి సూట్ బుక్ చేసింది. ఈ నెల 10 నుండి 15వరకు ఈ సూట్ ని బుక్ చేశారని సమాచారం. ఐశ్వర్య రాయ్ కి సిజేరియన్ అని తెలుస్తోంది. అందుకని బచ్చన్ కుటుంబం సరిగ్గా 11-11-11న ఆమెకు ఆపరేషన్ చేయించాలని అనుకుంటున్నట్లు ఓ వార్త బాలీవుడ్ ఫిల్మిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. 800ఏళ్లకి ఒకసారి వచ్చే ఫ్యాన్సీ డేట్-11-11-11 కాబట్టి, ఆ ప్రత్యేకమైన తేదీన ఐశ్వర్య రాయ్ బిడ్డకు జన్మనిస్తే బాగుంటుందని ఈ కుటుంబం భావితస్తోందట.


Click it and Unblock the Notifications











