బెల్లంకొండ కోసం ప్రభాస్ దర్శకుడు.. బాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్
టాలీవుడ్ ఇండస్ట్రీలో జయాపజయాలను లెక్క చేయకుండా సినిమాలు చేసే రిచేస్ట్ హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. ఒక సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఈ హీరో నెక్స్ట్ సినిమా బడ్జెట్ విషయంలో ఏ మాత్రం తేడా ఉండదు. ఇక హిట్ అనే టాక్ వస్తే చాలు ఆ సెలబ్రేషన్స్ మరో రేంజ్ లో ఉంటాయి. తరువాత సినిమా అంతకు మించి అనేలా ఉండాలని ప్లాన్ చేసుకుంటాడు.
గత కొన్ని రోజులుగా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టబోతున్నట్లు టాక్ గట్టిగానే వస్తోంది. ఎందుకంటే ఈ హీరో హిందీ డబ్బింగ్ సినిమాలు కొన్ని యూ ట్యూబ్ లో 100మిలియన్లకు పైగా వ్యూవ్స్ ని అందుకున్నాయి. అసలు మ్యాటట్ లోకి వస్తే రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి బాక్సాఫీస్ హిట్ ఛత్రపతిని హిందీలో రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. బెల్లంకొండ శ్రీనివాస్ హీరో అని టాక్ గట్టిగానే వస్తోంది.

ఇక దర్శకుడు ఎవరనే విషయం చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో సాహో దర్శకుడు సుజిత్ అని మరో కొత్త టాక్ వైరల్ గా మారింది. మెగాస్టార్ లూసిఫర్ ని రీమేక్ చేయాలని అనుకున్న సుజిత్ స్క్రిప్ట్ ని అంచనాలకు తగ్గట్లుగా రెడీ చేయలేక డ్రాప్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తెలుగు సినిమా ఛత్రపతిని రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











