అంతా ఉత్తిదే: డిసెంబర్లో కోహ్లి, అనుష్క పెళ్లి జరుగడం లేదా?
డిసెంబర్ మాసంలో విరాట్ కోహ్లి-అనుష్క శర్మ వివాహం వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి కొన్ని రోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. అయితే రెండు మూడు రోజులుగా ఈ ఇద్దరి పెళ్లి గురించిన వార్త మీడియాలో హైలెట్ అవుతోంది. డిసెంబర్లో వీరి వివాహం జరుగబోతోందంటూ ప్రచారం మొదలైంది.
Recommended Video

ఇటీవల ఈ ఇద్దరూ కలిసి పెళ్లి దుస్తువుల బ్రాండ్ కమర్షియల్ యాడ్ చేయడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది. కోహ్లి కూడా తాను వ్యక్తిగత కారణాలతో డిసెంబర్లో అందుబాటులో ఉండక పోవచ్చని బిసీసీఐకి సమాచారం అందించడంతో అంతా నిజమే అనుకున్నారు.

బ్యాడ్ న్యూస్ ఏమిటంటే... ఈ వార్తల్లో నిజం లేదు
అయితే బ్యాడ్ న్యూస్ ఏమిటంటే... ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. డిసెంబర్లో అనుష్క పెళ్లి జరుగుతుందనే విషయంలో నిజం లేదని అనుష్క వ్యవహారాలు చూసుకుంటున్న టాలెంట్ ఏజెన్సీ ప్రతినిధులు ఎన్డీటీవీకి తెలిపారు.

గతంలో బ్రేకప్ అంటూ రూమర్స్
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. గతంలో ఈ ఇద్దరూ కొంతకాలంగా దూరంగా ఉండటంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అయినట్లు కూడా పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే.

పెళ్లి చేసుకునేంత తీరికలేదు
పెళ్లి వేడుక అంటే దాదాపు నెల రోజుల పాటు ఫ్రీ టైమ్ కావాలి. అయితే ఇటు అనుష్క కానీ, విరాట్ కానీ అంత సమయం కేటాయించే పరిస్థితుల్లో లేరని వారి వ్యవహారాలు చూసే టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థలు వెల్లడిస్తున్నాయి.

నిజం చేదుగానే ఉంటుంది
అనుష్క, విరాట్ కోహ్లి వివాహం జరుగబోతోందని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఇది చేదు లాంటి నిజమే. వారి నుండి అఫీషియల్ గా అనౌన్సమెంట్ వచ్చే వరకు అభిమానులు కూడా ఈ విషయంలో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోక పోవడమే బెటర్.


Click it and Unblock the Notifications











