కోహ్లీ కంటే ముందు అనుష్క అంత మందితో ఎఫైర్ నడిపిందా? ఆ స్టార్ క్రికెటర్‌తోనూ డేటింగ్!
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్లుగా స్థిరపడాలంటే చాలా సవాళ్లను దాటుకుని వెళ్లాలి. ఇలా ఎంతో మంది భామలు అన్నింటినీ తట్టుకుని స్టార్లుగా మారిపోయారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో మాయ చేస్తోన్న ఈ చిన్నది.. చాలా తక్కువ సమయంలోనే హై రేంజ్‌కు ఎదిగింది. అయితే, ఇప్పుడు మాత్రం సినిమాల వేగం తగ్గించేసింది. అయినప్పటికీ తరచూ ఏదో ఒక అంశం వల్ల వార్తల్లో నిలుస్తోంది. ఇలా ఇప్పుడు అనుష్క శర్మ లవ్ స్టోరీలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాల్లోకి వెళ్తే....
ఆ సినిమాతో సెన్సేషన్
మోడలింగ్ రంగంలో సత్తా చాటుకున్న అనుష్క శర్మ 'రబ్ దే బనా ది జోడీ' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతో సెన్సేషన్ అయిన ఆమెకు బాలీవుడ్‌లో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే అనుష్క 'బాద్‌షా కంపెనీ', 'బాండ్ బజా బరాత్', 'పాటియాలా హౌస్', 'పీకే', 'ఎన్‌హెచ్ 10' వంటి ఎన్నో క్రేజీ సినిమాల్లో నటించి స్టార్‌గా మారింది.

కోహ్లీని పెళ్లి చేసుకుని
హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే అనుష్క శర్మ.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఓ వ్యాపార ప్రకటనలో నటించింది. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ పెరిగింది. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు డీప్‌గా ప్రేమాయణం సాగించిన వీళ్లిద్దరూ.. కొన్నేళ్ల క్రితమే వివాహం చేసుకున్నారు.
తల్లైన తర్వాత ఎంట్రీ
అనుష్క శర్మ.. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కెరీర్‌ను కంటిన్యూ చేసింది. అయితే, ఆమె గర్భం దాల్చడంతో కాస్త గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత అంటే 2021 జనవరిలో ఓ పాపకు జన్మనిచ్చింది. ఇలా దాదాపు రెండేళ్లకు పైగానే అనుష్క సినిమాలో యాక్ట్ చేయలేదు. కానీ, నిర్మాతగా కంటిన్యూ అయింది. తర్వాత 'చక్దాహా ఎక్స్‌ప్రెస్' మూవీ చేసినా అది రిలీజ్ కాలేదు.

ఇప్పుడు మానేసింది
అనుష్క శర్మ ప్రస్తుతం ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు. దీనికి కారణం కొద్ది నెలల క్రితం ఆమె రెండోసారి తల్లవడమే. దీనివల్లే ఈ అమ్మడు సినిమాలు చేయడమూ, తీయడమూ ఆపేసింది. కానీ, సోషల్ మీడియా ద్వారానో, కోహ్లీ కోసం క్రికెట్ మ్యాచ్‌లకు హాజరు అవడం వల్లనో అభిమానులకు కనిపిస్తోంది. ఇలా తరచూ అనుష్క శర్మ హెడ్‌లైన్స్‌లో ఉంటోంది.
అనుష్క లవ్ స్టోరీలు
సాధారణంగా సినీ రంగంలో ఉన్న హీరోయిన్లకు లవ్ ఎఫైర్లు ఉంటుంటాయి. ఇలా అనుష్కకు కూడా కొన్ని ప్రేమకథలు ఉన్నట్లు తాజాగా ఓ సమాచారం వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ముందుగా ఆమె జోహెడ్ యూసఫ్ అనే ర్యాంప్ మోడల్‌తో డేటింగ్ చేసిందట. మోడలింగ్ రోజుల్లో వీళ్లిద్దరూ బెంగళూరులో కలిసి అప్పటి నుంచి చాలా కాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగారని టాక్.

కోహ్లీ కంటే ముందుగా
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. అనుష్క శర్మ.. విరాట్ కోహ్లీ కంటే ముందు పలువురు బాలీవుడ్ హీరోలతో ప్రేమాయణం సాగించిందట. అందులో రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్, షాహీద్ కపూర్, అర్జున్ కపూర్ వంటి వాళ్లు ఉన్నారని తెలిసింది. మరీ ముఖ్యంగా అనుష్క శర్మ.. స్టార్ క్రికెటర్ సురేష్ రైనాతోనూ డేటింగ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











