Pawan Kalyan: విరాటపర్వం దర్శకుడితో పవర్ స్టార్ న్యూ ప్రాజెక్ట్.. అలా సెట్ చేస్తున్న బడా సంస్థ?

నీది నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న వేణు ఉడుగుల విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పాజిటివ్ వైబ్రేషన్స్ తోనే బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంటోంది. అయితే ఈ దర్శకుడికి అగ్ర హీరో పవన్ కళ్యాణ్ నుంచి కూడా పిలుపు వచ్చినట్లు సమాచారం. అసలు వీరి కలయికలో ఎలాంటి సినిమా రానుంది.. ఈ కాంబినేషన్ ను ఎవరు నిర్మిస్తున్నారు అనే వివరాల్లోకి వెళితే..

మంచి టాక్ తో విరాటపర్వం

మంచి టాక్ తో విరాటపర్వం

దర్శకుడు వేణు మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏమిటో నిరూపించుకున్నాడు. ఇక ఆ తర్వాత అతను నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఒక అందమైన ప్రేమకథగా రూపొందించిన విరాటపర్వం సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాయి పల్లవి రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదలకు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మంచి టాక్ తో ముందుకు సాగుతోంది.

రిజల్ట్ తో సంబంధం లేకుండా..

రిజల్ట్ తో సంబంధం లేకుండా..

అయితే దర్శకుడు వేణుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కూడా పిలుపు వచ్చినట్లు సమాచారం. సాదారణంగా పవన్ కళ్యాణ్ స్టార్ దర్శకులతో కంటే కూడా ఎక్కువగా చిన్న దర్శకులతోనే వర్క్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. టాలెంట్ ఉంటే చాలు చిన్న దర్శకులకు పవన్ చాలా ఈజీగా అవకాశం ఇస్తూ ఉంటాడు. ఇక వేణు కు కూడా అలాంటి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. విరాటపర్వం రిజల్ట్ ఎలా ఉన్నా పరవాలేదు అని అతనితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ ప్లాన్?

త్రివిక్రమ్ ప్లాన్?


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన కథల విషయంలో త్రివిక్రమ్ నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా బిజీగా ఉండడంతో సినిమా కథలకు సంబంధించిన అన్ని రకాల విషయాలను కూడా త్రివిక్రమ్ ప్రత్యేకంగా ఆలోచించే పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి. ఇక ఇప్పుడు వేణు టాలెంట్ గురించి తెలుసుకొని త్రివిక్రమ్ అతనికి కూడా పవన్ తో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం.

 అలాంటి కథను?

అలాంటి కథను?

ఇక త్రివిక్రమ్ ఆలోచన మేరకు తన దగ్గర ఉన్న ఒక మంచి కథను డెవలప్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో సామాజిక అంశాలతో పాటు పవన్ కళ్యాణ్ హీరోయిజాన్ని కూడా హైలెట్ చేసే విధంగా కథను రూపొందించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విరాటపర్వం సినిమాలో నక్సలిజాన్ని చూపించిన వేణు ఆ తరవాత సినిమాల్లో మాత్రం మరొక మంచి అభ్యుదయ భావాలున్న కథను హైలెట్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

రంగంలోకి సితార

రంగంలోకి సితార


ఇక వేణు ఊడుగుల పవన్ కళ్యాణ్ కలయికలో తెరకెక్కే సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ తో నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ ఇదివరకే పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. అలాగే మరొక రెండు ప్రాజెక్టులను కూడా నిర్మించాలని అనుకుంటుంది. అది కూడా వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఇక అందులో భాగంగానే వేణు ఉడుగులతో కూడా ఒక ప్రాజెక్టు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X