Virosh Wedding: విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న రిసెప్షన్.. మొదట ఎవరు ప్రపోజ్ చేశారంటే?
Virosh Wedding: టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) జంట వైవాహిక బంధంతో ఒక్కటవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం కొనసాగించిన ఈ కపుల్స్, చివరికి ఫిబ్రవరి 26 వ తేదీన రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లేసిన సంగతి తెలిసిందే. సన్నిహితులు, కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాల నడుమ ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి రెండు సంప్రదాయాల్లో రెండు సార్లు ఘనంగా జరిగింది. అయితే.. రష్మిక- విజయ్ ల్లో మొదట ఎవరు ప్రపోజ్ చేశారంటే?
హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్
స్టార్ కపుల్ రష్మిక- విజయ్ దేవరకొండ వెడ్డింగ్ రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ఈ కొత్త జంట రిసెప్షన్ వేడుక జరగబోతోంది. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ పేద రాయుడు గెటప్ లో పంచ కట్టుకొని రాయల్ గా కనిపించగా, రష్మిక మందన్న రెడ్ శారీలో అదరగొట్టింది. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా హాజరవుతున్నారు. భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా నిర్వహించారు.

రిసెప్షన్‌కు ముందు తెలుగు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ తనదైన స్టైల్‌లో ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. 'తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చింది.. ఆమెను మీరు మంచిగా చూసుకోవాలి. మీ ఆశీస్సులు మాకు కావాలి' అంటూ రష్మికను పరిచయం చేశారు. 'మా జర్నీలో మీడియా ఎప్పుడూ భాగమే. ఇప్పుడు పెళ్లి చేసుకుని జంటగా మీ ముందుకు రావడం కొత్త అనుభూతి' అని అన్నారు. రష్మిక కూడా తన ఆనందాన్ని పంచుకుంటూ, "మేం కలిసి జీవితంలో ఒక అందమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం. మీ అందరి ప్రేమ, మద్దతు ఇలాగే ఉండాలి" అని తెలిపింది. అభిమానుల ఆదరణతో ముందుకు సాగుతామని స్పష్టం చేసింది.
మొదట ప్రపోజ్ చేసింది ఎవరు?
ఈ సెలబ్రెటీ కపుల్ వెడ్డింగ్ రిసెప్షన్ జరుగుతున్న వేళ.. సోషల్ మీడియాలో రష్మిక - విజయ్ లవ్ స్టోరీ నెట్టింట్లో తెగ వైరలవుతుంది. ఈ లవ్ స్టోరీలో ముందుగా ప్రపోజ్ చేసింది ఎవరు? అభిమానుల ప్రకారం.. 'రష్మికనే మొదట విజయ్‌కు లవ్ ప్రపోజ్ చేసింది' అని విజయ్ స్వయంగా ఓ గ్రీట్ & మీట్ కార్యక్రమంలో చెప్పినట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. గీతా గోవిందం, డియర్ క్రామెడ్ సినిమాల తర్వాత తమ మధ్య ప్రేమ మొదలైందని విజయ్ చెప్పారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇటీవల అభిమానులతో కలిసి లంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఈ జంట, స్వయంగా భోజనం వడ్డించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ కార్యక్రమంలోనే ఈ ప్రేమ ప్రపోజల్ విషయంపై విజయ్ క్లారిటీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఆన్ స్క్రీన్ నుంచి ఆఫ్ స్క్రీన్ వరకూ...
వీరిద్దరి పరిచయం స్టార్ అయ్యింది 2018లో విడుదలైన గీతా గోవిందం (Geetha Govindam) సినిమాతో అని టాక్.. ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తరువాత 2019లో వచ్చిన డియర్ కామ్రెడ్ తో ఈ జంట మరింత దగ్గరైంది. ఈ రెండు సినిమాల తర్వాతే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని అభిమానులు భావిస్తున్నారు. ఎన్నో రూమర్స్, అనుమానాలు, మీడియా ఊహాగానాల మధ్య కూడా తమ బంధాన్ని బహిర్గతం చేయకుండా ఎనిమిదేళ్లు గడిపిన ఈ జంట, చివరకు పెళ్లి ద్వారా అధికారికంగా తమ ప్రేమకథకు ముగింపు పలికింది.


Click it and Unblock the Notifications











