twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విశాల్ నిజజీవితంలో అమ్మాయిల పిచ్చోడా?

    By Srikanya
    |

    విశాల్ నూతన చిత్రంలో ప్లే బోయ్‌ పాత్రను చేస్తున్నారు.అయితే విశాల్‌ నిజ జీవితంలోని వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్ర ఈ చిత్రంలో ఉంటుందని దర్శకుడు తిరు బహిరంగంగా స్టేట్ మెంట్స్ ఇస్తున్నాడు. దాంతో విశాల్ నిజజీవితంలో అమ్మాయిలతో ఎఫైర్స్ పెట్టుకుని తిరుగుతూంటాడా అని కొందరు ఎగతాళి చేస్తున్నారు. అయితే నిజంగానే విశాల్ ఏమీ బుద్దిమంతుడు కాదని,అతనిది ప్లే బోయ్ మనస్ధతత్వమేనని అంటున్నారు. అలాగే అతను ఎవరితోనూ కమిట్మెంట్ కి ఇష్టపడడని,అతి జాగ్రత్తపరుడని చెన్నై ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ నూతన చిత్రం 'తీర్థ విలైయాట్టు పిళ్ళై' ఒక హీరో ప్లస్‌ ముగ్గురు హీరోయిన్‌లు కాస్సెప్ట్ లో కలర్‌ఫుల్‌గా నడుస్తుంది. విశాల్ సరసన ఈ చిత్రంలో తనుశ్రీదత్తా, సారాహ్‌జానే, నీతూచంద్ర నాయికలుగా నటిస్తున్నారు. వీరికి అదనంగా ఓ పాత్రలో అందాల నటి స్నేహ కూడా చేరారు. స్నేహ కూడా తన పాత్ర గురించి గొప్పగా చెప్తోంది. తాను పోషించే కేరక్టర్‌ చిన్నదైన్పటికీ కథపరంగా మంచి కీలకమైందని అంటోంది. ఇక ఇంతకు ముందు రీమాసేన్ తో ఎఫైర్ నడిపిన విశాల్ అనంతరం శ్రియతో కొంతకాలం కాలక్షేపం చేసాడని చెప్తూంటారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X