»   » విక్రమ్ ని చూసి భయపడుతున్నాడు

విక్రమ్ ని చూసి భయపడుతున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇన్నాళ్ళూ స్టార్ హీరోగా పోటీ పడుతూ,నటిస్తూ పోతున్న విశాల్ ఒక్కాసరి గాడితప్పి వాడు..వీడు చిత్రం చేసాడు.బాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంతో అతనికి నేషనల్ అవార్డు కొట్టాలనే ఆలోచన ఉంది.అయితే పరిస్ధితులు అతనికి సహకరించేటట్లు కనపడటం లేదు.విక్రమ్ నాన్న చిత్రం కూడా ఆ పోటీలో నిలబడి విన్ అయ్యేటట్లు ఉంది.అదే బెంగపట్టుకుంది విశాల్ కి.పోటీ లోకుండా ఉంటే ఇనానమస్ గా అవార్డు వచ్చేదని అతను,సోదరుడు విక్రమ్ కృష్ణ బాధపడుతున్నారని తమిళ పరిశ్రమలో వినపడుతోంది.

జికె ఫిల్మ్ కార్పోరేషన్ మీద రూపొందించబడ్డ ఈ చిత్రం కేవలం విశాల్ కోసమే తీసారు.సొంత బ్యానర్ మీద తీసిన వాడూ వీడు చిత్రం కమర్షియల్ గా ఊహించిన విధంగా వర్కవుట్ కాలేదు.కానీ మంచినటుడుగా విశాల్ రాణించాడని అంతా చెప్పుకున్నారు.అలాగే విక్రమ్ నాన్న చిత్రం కూడా కమర్షయల్ గా బ్రేక్ ఇవ్వకపోయినప్పటికీ విక్రమ్ నటనా విశ్వరూపం అని మాట్లాడుకున్నారు.విమర్శకులు సైతం విక్రమ్ నటనకు జేజేలు పలికారు.ఈ నేపధ్యంలో విశాల్ కి వేరే ఆప్షన్ కనపడటం లేదు..కేవలం తనకు పోటిగా విక్రమ్ కనపడి భయపెడుతున్నాడు.

English summary
Vishal’s worry is about hero Vikram coming up with a riveting performance in the film ‘Naana’. Since the film ‘Naana’ has come in the same year as that of ‘Vaadu Veedu’, it is obvious that Vikram and Vishal will now be in contention for the award.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu