Vishal- Sai Dhanshika: విశాల్ - సాయి ధన్సిక పెళ్లి వాయిదా? బర్త్ డే రోజు హీరో కీలక ప్రకటన?
భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే ఖచ్చితంగా వినిపించే వ్యక్తుల్లో కోలీవుడ్ హీరో విశాల్ కూడా ఒకరు. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న విశాల్.. ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఆయన అభిమానులను బాధిస్తోంది. పలువురు హీరోయిన్లతో విశాల్‌కు ఎఫైర్స్ ఉన్నాయని.. త్వరలోనే ఫలానా హీరోయిన్‌తో విశాల్ పెళ్లి జరగబోతోందని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ గాలి వార్తలుగానే మిగిలిపోయాయి. ఇలాంటి దశలో హీరోయిన్ సాయి ధన్సికను తాను త్వరలో పెళ్లాడబోతున్నట్లుగా విశాల్ స్వయంగా ప్రకటించడంతో సినీ వర్గాలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశాయి. అలాంటిది విశాల్ పెళ్లి వాయిదా పడినట్లుగా కోలీవుడ్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
పలువురు హీరోయిన్లతో విశాల్ డేటింగ్
తెలుగువాడైన విశాల్ కోలీవుడ్‌లో యాక్షన్ హీరోగా, యాంగ్రీ యంగ్‌మెన్ ఇమేజ్ సంపాదించారు. తన రూపం, కలర్ హీరో ఇమేజ్‌కు తగిన విధంగా లేనప్పటికీ కష్టపడి తమిళ స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచారు విశాల్. కేవలం హీరోగానే ఆగిపోకుండా సినీ నటుల, కార్మికుల సంక్షేమం కోసం నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా కృషి చేశారు. పలు కీలక నిర్ణయాలతో ఇండస్ట్రీని షాక్‌కు గురిచేశారు. హీరో హీరోయిన్ల మధ్య లింకులు పెట్టడం మీడియాకు తొలి నుంచి అలవాటే.. అలా వరలక్ష్మీ శరత్ కుమార్, అభినయ, లక్ష్మీమీనన్, అనీషా రెడ్డి, రీమాసేన్ తదితర హీరోయిన్లతో విశాల్ ప్రేమాయణం సాగించారని సోషల్ మీడియాలో గాసిప్స్ వచ్చాయి. వీటికి స్వయంగా విశాల్ పలుమార్లు చెక్ పెట్టేశారు.

సాయి ధన్సికతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్
అయితే దశాబ్థాల కల అయిన నడిగర్ సంఘం భవనం పూర్తయ్యాకే తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ శపథం చేశారు. వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 నాటికి భవనాన్ని ప్రారంభించాలని విశాల్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే సమయంలో తాను ఒకరితో రిలేషన్‌లో ఉన్నానని, త్వరలోనే ఆమె ఎవరో బయట పెడతానని షాకిచ్చారు విశాల్. యోగిత మూవీ ఈవెంట్‌కు హాజరైన విశాల్.. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సాయి ధన్సికను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియా సాక్షిగా ప్రకటించారు. గత కొంతకాలంగా సాయి ధన్సికతో విశాల్ డేటింగ్‌లో ఉన్నారని వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
8 ఏళ్లుగా సాయితో డేటింగ్
తంజావూరుకు చెందిన సాయి ధన్సిక 2009లో పేరణ్మాయితో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అరవణ్, పరదేశి తదితర చిత్రాల్లో నటించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీలో ఆయనకు కూతురిగా నటించి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోనూ షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో నటించారు. 8 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నప్పటికీ గుట్టుగా తమ బంధాన్ని నడిపించారు విశాల్ - సాయి ధన్సిక. నడిగర్ సంఘం భవనం ప్రారంభోత్సవానికి సిద్ధం కానుండటం, విశాల్ పెళ్లి సందడి ఎక్కడా కనిపించకపోడంతో మీడియాలో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాల్ పెళ్లి వాయిదా పడినట్లుగా గత కొద్దిరోజులుగా మీడియాలో కథనాలు వస్తుండటంతో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
విశాల్ - సాయి ధన్సిక పెళ్లి వాయిదా?
ఇటీవల రెడ్ ఫ్లవర్ ఆడియో రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వెళ్లిన హీరో విశాల్‌ను మీడియా ప్రతినిధులు పెళ్లెప్పుడు అని ప్రశ్నించారు. నడిగర్ సంఘం భవనం కోసం 9 ఏళ్లు పెళ్లి చేసుకోలేదని.. మరో 3 నెలలు ఆగలేనా అని వ్యాఖ్యానించారు. భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని.. నడిగర్ భవనంలో తొలి పెళ్లి నాదేనని, ఇప్పటికే బుకింగ్ కూడా చేసుకున్నానని విశాల్ చెప్పారు. ఆగస్ట్ 29న ఓ గుడ్ న్యూస్ చెబుతానని అన్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి విశాల్ తన పెళ్లి ఆగస్ట్ 29న జరగడం లేదని పరోక్షంగా హింట్ ఇచ్చినట్లయ్యింది. అయితే ఆగస్ట్ 29న తన పెళ్లికి కొత్త ముహూర్తం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











