వరలక్ష్మితో విశాల్ ప్రేమాయణం?
ఇటీవల వాడు-వీడు సినిమాలో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న విశాల్ గురించి ఇప్పడు కోలీవుడ్ లో హాట్ గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో విశాల్ ప్రేమలో పడ్డాడని ఆ వార్తల సారాంశం. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య చనువు బాగా పెరిగిందని...సీక్రెట్ గా కలుసుకుని సంథింగ్ సంథింగ్ చేసుకుంటున్నారని కోలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి విశాల్ తండ్రి జికె రెడ్డికి అస్సలు ఒప్పుకోవడం లేదట.
సినిమా నిర్మాణ రంగంలో ఉన్న విశాల్ తండ్రి జికె.రెడ్డి, వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ ఒకప్పుడు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇద్దరు కలిపి పలు సినిమాల్లో కలిసి పని చేశారు. ఈ ఇద్దరు కలిసి పని చేసిన చివరి సినిమా 'ఐ లవ్ ఇండియా". అయితే ఈ సినిమా నష్టాల పాలు కావడంతో ఏర్పడ్డ చిన్న వివాదం ఇద్దరి మధ్య దూరం పెంచిందని అంటారు. ఆ కారణంగా శరత్ కుమార్ తో బంధుత్వం కలుపుకోవడానికి ఇష్ట పడటం లేదట విశాల్ తండ్రి.
ఇదే విషయమై విశాల్ ను పాత్రికేయులు ప్రశ్నిస్తే...వరలక్ష్మికి, తకు మధ్య మీరు అనుకున్న సంబంధం ఏమీ లేదని, మేం చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం, కలిసి తిరిగినంత మాత్రాన తప్పుగా ఊహించుకుంటే ఎలా? అని బుకాయిస్తున్నాడు. సినిమా రంగంలో ఉన్న వారు తమ తోటి స్టార్లతో ఎఫైర్లు నడిపిండం, ప్రశ్నిస్తే అబ్బే అదేమీ లేదని బుకాయించడం షరా మామూలే. మరి విశాల్ లవ్ మ్యాటర్ ఎక్కడి వరకు వెలుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











