ఆ హీరో ఎందుకు చిక్కాడంటే....

By Staff

Vishnuvardhan
సలీమ్ ...దుమ్ము రేపుతాడు టైటిల్ తో దర్శకుడు వై.వి.యస్ చౌదరి తాజాగా ఓ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి శ్రీకారం చుడుతున్నాడు. దానిలో హీరోగా మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు వర్ధన్ బాబు ని ఎంపిక చేసారు. చిత్రంలో రొమాన్స్ చేసే ప్రేమికుని పాత్ర కోసం అతన్ని బాగా సన్నపడాలని చౌదరి మరీమరీ చెప్పాడట. దానికి మొదట్లో ఈ ప్రపోజల్ కి విష్ణు ఒప్పుకోక పోయినా ...తర్వాత దగ్గర వాళ్లు కూడా ఇదే కొత్త ట్రెండ్ అని వారంతా చౌదరినే సపోర్ట్ చేసారుట. దాంతో తప్పని స్ధితిలో కష్టపడి బొద్దుగా,సొట్ట బుగ్గలతో ఉండే అతను పూర్తిగా చిక్కిపోయి ఎవరూ గుర్తు పట్టలేనట్లుగా తయారయ్యాడు. నిజానికి ఇదంతా ఎన్టీఆర్ చలవే నంటున్నారు.

ఎన్టీఆర్ దర్శకుడు రాజమౌళి సలహా మేరకు వెయిట్ తగ్గి స్లిమ్ గా తయారై యమదొంగ గా మారి హిట్టు కొట్టాడు. ఆ సంఘటనను స్ఫూర్తిగా తీసుకునే వై.వి.యస్ ఈ సలహా ఇచ్చాడని తెలుస్తోంది. సర్లే సిక్స్ పాక్ బాడీతో తయారు అవ్వమని చెప్పలేదు...అక్కడదాకా అదృష్టవంతుడునని విష్ణూ ఫాలో అప్ చేసాడట.ఇంతకీ తమ సొంత బ్యానరైన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పై మోహన్ బాబు ఈ చిత్రం నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు వచ్చే నెల (జూన్) లోనే సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. హీరోయిన్ గా కొత్తమ్మాయి (ముంబాయి) ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు.అయినా ఇదే శరీరంతో 'ఢీ' సినిమా హిట్టు కొట్టలేదా ...అయినా కథ సరిగ్గా ఉంటే దానంతట అదే కలక్షన్ల దుమ్ము రేపుతుందని ఫిల్మ్ నగర్ వాళ్ళు గొణుక్కుంటున్నారు. అయినా తగ్గమన్నది వై.వి.యస్...తగ్గింది విష్ణు..నష్టమైనా లాభమైనా వాళ్ళకే .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X