ఫ్లాప్ చిత్రం 'డిపార్టమెంట్' తో పోల్చి నవ్వుతున్నారు

By Srikanya

Vishnu Manchu to play cop in RGV's next
హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ,దగ్గుపాటి రానా కాంబినేషన్ లో వచ్చిన 'డిపార్టమెంట్' గుర్తుండే ఉంటుంది. హిందీలో రిలీజ్ అయిన ఈ చిత్రం అప్పట్లో తెలుగులోనూ విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ హిందీలో పెద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో, అంతంత మాత్రంగా ఉన్న దగ్గుపాటి రానా ఇమేజికి మరింత గండి కొట్టడమెందుకని తెలుగులో రిలీజ్ ఆపేసారు. ఆ సినిమా పేరు చెపితేనే ఉలిక్కిపడే స్టేజి ఉంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు మంచు విష్ణు చిత్రాన్ని ఆ సినిమాతో పోలుస్తూ మీడియాలో వార్తలు రావటం మంచు అభిమానులను బాధిస్తోంది.

మంచు విష్ణు, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో ఓ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మంచు విష్ణు టఫ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. దాంతో మళ్లీ పోలీస్ ఆఫీసర్ కథతో వర్మ సినిమా చేస్తున్నాడు అంటే అది డిపార్టమెంట్ లాగ ఉంటుందని అంటున్నారు. అయితే విష్ణు మాత్రం ఈ చిత్రం మంచి కాన్ఫిడెన్స్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మరో ప్రక్క ఆయన రౌడీ చిత్రాన్ని ఇంకా ప్రమోట్ చేస్తున్నారు.

మంచు విష్ణు మాట్లాడుతూ "రౌడీ సినిమానటుడిగా నాకు ఎంతటి మంచి పేరుని తెచ్చి పెట్టిందో మా సినిమాను కొన్నపంపిణీ దారులకు కూడా అంతే ఆనందాన్ని మిగిల్చింది. రాం గోపాల్ వర్మదర్శకత్వంలో నటించడం నాకొక చక్కని అనుభూతినిచ్చింది. ముఖ్యంగావర్మ మా నాన్న గారి పాత్ను తీర్చి దిద్దిన తీరు అద్భుతం. రాయలసీమరామన్న చౌదరి తరువాత మా నాన్న గారిని అంత రౌద్రంగా చూపించినచిత్రమిది. ఈ సినిమాకున్న మారో ప్రత్యేకత ఏమిటంటే ... మానిర్మాతలు ఈ సినిమా నిర్మానానికి ఖర్చు చేసినదంతా కేవలం తొలి వారంకలెక్షన్ల రూపంలోనే లభించడం. ఈ విషయం మాకు ఎంతో సంతోషాన్నికలిగిస్తోంది అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X