twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త అనుమానాలు రేపుతున్న విష్ణుప్రియ పోస్ట్.. అవినాష్ పెళ్లితో లింకులు.. అసలేమందంటే?

    |

    తెలుగు యాంకర్స్ లో ఇప్పుడు విష్ణు ప్రియా టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది. చేసింది కొన్ని షోస్ అయినా సరే సోషల్ మీడియాలో మాత్రం ఆమె మంచి పాపులారిటీ సంపాదించింది.. ప్రస్తుతానికి స్పెషల్ గా యాంకర్ గా ఎలాంటి షోలు చేయడం లేదు కానీ కొన్ని సినిమాలు వెబ్ సిరీస్ లు ఒప్పుకుని నటనారంగంలో దూసుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే అవినాష్ పెళ్లి తర్వాత విష్ణుప్రియ చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.. వివరాల్లోకి వెళితే

     యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి

    యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి

    యాంకర్ విష్ణుప్రియ బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి సినిమాల్లో మంచి నటిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేసింది. సినిమా అవకాశాలు దక్కలేదు గానీ డిజిటల్ రంగం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నేపథ్యంలో ఆమెకు వెబ్ సిరీస్ లో నటించే అవకాశాలు దక్కుతున్నాయి.. పనిలో పని ఆమె కూడా తాను హాట్ అనే ముద్ర వేయించుకోవడం కాదు సోషల్ మీడియాలో రకరకాల హాట్ హాట్ ఫోటోలు విడుదల చేస్తూ అటు ప్రేక్షకులను ఇటు వెబ్ సిరీస్ మేకర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది.

    రకరకాల వీడియోలు పెడుతూ

    రకరకాల వీడియోలు పెడుతూ

    ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో తెగ బిజీ అవుతున్న విష్ణు ప్రియ సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో రచ్చ చేస్తోంది. అలాగే యూబ్యూబ్‌‌లో రకరకాల వీడియోలు పెడుతూ ఫ్యాన్స్‌ తో టచ్ లో ఉంటున్న ఈ భామ మొన్న ముక్కు అవినాష్ పెళ్లికి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసింది.

    సంచలన పోస్ట్

    సంచలన పోస్ట్

    అయితే ఆ పెళ్లయిన కొద్ది రోజులకే విష్ణుప్రియ ఓ పోస్ట్ పెట్టింది. ఈ ఏడాదిలో మనం ఎప్పటికీ మనతోనే ఉండాలని అనుకునే వ్యక్తుల్ని కోల్పోయాం అంటూ ఓ మీమ్ పేజ్ వేసిన పోస్ట్‌ ను షేర్ చేస్తూ విష్ణుప్రియ అవును నిజమే అంటూ స్పందించింది. అయితే విష్ణుప్రియ ఎవరిని కోల్పోయింది? ఎప్పుడు కోల్పోయింది? అంటూ నెటిజన్లు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

    ముక్కు అవినాష్ పెళ్లి

    ముక్కు అవినాష్ పెళ్లి

    అయితే విష్ణు ప్రియ వేదాంతం వెనుక ముక్కు అవినాష్ పెళ్లి కారణమా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందని ఆ మధ్య కామెంట్స్ వినిపించాయి. అవినాష్, విష్ణు ప్రియ, శ్రీముఖి ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ అనే టాక్ ఉంది. కానీ అవినాష్, విష్ణు ప్రియ మధ్య అంతకు మించిన రిలేషన్ ఉందనే టాక్ కూడా నడిచింది. అయితే అవినాష్ మాత్రం తన చిన్ననాటి స్నేహితురాలు అనూజతో ఏడడుగులు వేసిన తరువాత విష్ణుప్రియ చేసిన పోస్ట్ చర్చనీయాంశమవుతోంది.

    Recommended Video

    #BiggBossTelugu5 : Vj Sunny సూపర్ పవర్ | Shannu ని దాటేస్తాడేమో || Filmibeat Telugu
    కొత్త అనుమానాలు

    కొత్త అనుమానాలు

    విష్ణుప్రియ ఈ మధ్య ది బ్యూటీ అండ్ బేకర్స్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఈ సిరీస్ లో ఆమె సంతోష్ శోభన్ ప్రేయసిగా కనిపించింది. ఇక ఆమె మరిన్ని సిరీస్లో ఒప్పుకుంటుందా ఆమె ప్రచారం జరుగుతోంది వీటిని ఆమె అధికారికంగా ప్రకటించలేదు.. మొత్తంమీద విష్ణుప్రియ షేర్ చేసిన పోస్టు మాత్రమే ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయం మీద విష్ణుప్రియ స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

    English summary
    anchor Vishnu Priya shared related to relationship which arises doubts about relationship status.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X