HanuMan: దిల్ రాజుకు బెదిరింపులు.. హనుమాన్‌కు అండగా హిందూ సంఘాలు

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు విభిన్నమైన తరహా సినిమాలు రూపొందుతోన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రత్యేకమైన బజ్‌ను ఏర్పరచుకుంటున్నాయి. అలాంటి వాటిలో పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ మ్యాన్ స్టోరీతో రూపొందుతోన్న 'హనుమాన్' ఒకటి. సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తనదైన టాలెంట్‌తో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రమే 'హనుమాన్'. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ యాక్షన్‌తో రూపొందించారు. అందుకు అనుగుణంగానే దీన్ని సంక్రాంతి కానుకగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే జనవరి 12న రిలీజ్ చేయబోతున్నారు.

Vishwa hindu parishad and Bajrang Dal Supports Hanu Man Movie and Warning to Dil Raju

తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'హనుమాన్' చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నారు. అదే రోజు సూపర్ స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' మూవీ కూడా విడుదల అవుతుంది. దీంతో 'హనుమాన్' చిత్రానికి ఏ ప్రాంతంలోనూ థియేటర్లు పెద్దగా లభించడం లేదు. ఫలితంగా ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద వివాదంగా మారిపోయింది.

ఎన్నో అంచనాలతో రాబోతున్న 'హనుమాన్' చిత్రానికి థియేటర్ల విషయంలో అన్యాయం జరుగుతోందని చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది ఈ చిన్న సినిమా కోసం తమ గొంతును వినిపిస్తున్నారు. ఈ సమయంలో హిందూ సంఘాలు అయిన భజరంగ్ దల్, విశ్వహిందూ పరిషత్ సంస్థలు 'హనుమాన్'కు మద్దతుగా నిలిచినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Vishwa hindu parishad and Bajrang Dal Supports Hanu Man Movie and Warning to Dil Raju

'హనుమాన్' సినిమాకు దిల్ రాజు థియేటర్లు రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భజరంగ్ దల్, విశ్వహిందూ పరిషత్ సంస్థలకు సంబంధించిన కొందరు దిల్ రాజుకు బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు, ఈ చిత్రానికి ఎక్కువ థియేటర్లు కేటాయించకపోతే న్యాయ పరంగానూ చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే దిల్ రాజు స్పందించాల్సిందే.

ఇదిలా ఉండగా.. ఇదిలా ఉండగా.. 'హనుమాన్' మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా వర్క్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X