VS11: డిఫరెంట్ లుక్‌తో విశ్వక్ సేన్.. ఆ కాంట్రవర్సీ పొలిటీషియన్ రియల్ స్టోరీతో మూవీ?
వెళ్లిపోమాకే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విశ్వక్ సేన్ ఫలక్ నూమా దాస్ సినిమాతో మాస్ కా దాస్ గా గుర్తింపు పొందాడు. ఇటీవల దాస్ కా ధమ్కీ సినిమాతో థియేటర్ వద్ద సందడి చేసిన విశ్వక్ సేన్ ఓటీటీలో సైతం ఎంట్రీ ఇచ్చాడు. జియో సినిమా వేదికగా విడుదలైన బూ పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు మరో కొత్త అవతారంలో దర్శనం కానున్నాడు విశ్వక్ సేన్. ఆయన సినీ కెరీర్ లో తాజాగా వస్తున్న 11వ చిత్రం VS11 వర్కింగ్ టైటిల్ తో రానుంది.
ఓటీటీలోకి:తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు విశ్వక్ సేన్. ఇటీవలే హీరో కమ్ డైరెక్టర్ గా రూపొందించిన దాస్ కా ధమ్కీ సినిమాతో మంచి హిట్ట్ అందుకున్నాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా చేసిన ఈ మూవీలో విశ్వక్ డ్యూయెల్ రోల్ లో అలరించిన సంగతి తెలిసిందే. అలాగే స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్ సేన్. ఎన్నో ఓటీటీ చిత్రాల్లో నటించిన రకుల్.. విశ్వక్ తో కలిసి చేయడం ఇదే తొలిసారి.

జీవిత కథ ఆధారంగా:ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో విశ్వక్ సేన్ VS11 మూవీ రాబోతుంది. ఇటీవల స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక కాంట్రవర్సీ పొలిటీషియన్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇందులో విశ్వక్ సేన్.. ఎల్లో పార్టీకి చెందిన పొలిటికల్ లీడర్ గా కనిపిస్తాడట.

లీడ్ రోల్ మాత్రం:అతను వివాదాస్పద రాజకీయ వేత్త అని, అసాధారణ కారణాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారని న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే VS11 చిత్రం ఎవరికీ అనధికారిక బయోపిక్ కాదు అనీ, ఇందులోని లీడ్ రోల్ క్యారెక్టర్ ను మాత్రం ఒక మాస్ పొలిటీషియన్ రియల్ స్టోరీ నుంచి స్ఫూర్తిగా తీసుకున్నారని టాక్.

నారా రోహిత్ తో:కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ డిఫరెంట్ లుక్ అదిరిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే కృష్ణ చైతన్య గతంలో నారా రోహిత్ హీరోగా రౌడీ ఫెలో మూవీ రూపొందించాడు. ఈ మూవీ కూడా నారా రోహిత్ తోనే తీయాలనుకున్నాడని ఇండస్ట్రీలో వర్గాల్లో టాక్.
యువన్ శంకర్ రాజా మ్యూజిక్:ఇక విశ్వక్ సేన్ క్రేజ్ కారణంగా ఆ పాత్రకు అతనే బెస్ట్ అని ఫిక్స్ అయ్యారట. కాగా ఈ మూవీని సితారా ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాత నాగవంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంజలి హీరోయిన్ గా చేస్తుండగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











