Vishwambara Release Date: పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలకు క్లారిటీ... మెగాస్టార్ విశ్వంభర ఎప్పుడంటే?
Vishwambara Release Date: టాలీవుడ్‌లో ప్రస్తుతం రిలీజ్ డేట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. మెగా ఫ్యామిలీ నుంచి వరుసగా వస్తున్న భారీ ప్రాజెక్టులపై అభిమానుల్లో ఆసక్తి పీక్స్‌లో ఉంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి. దీంతో.. ఇప్పుడు అందరి చూపూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ మూవీ విశ్వంభర (Vishwambhara) పైనే పడింది. ఇంతకీ మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' సినిమా విడుదల ఎప్పుడంటే?
తాజాగా విడుదలైన అధికారిక అప్డేట్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ సినిమా మార్చి 26న, రామ్ చరణ్ మూవీ ఏప్రిల్ 30న థియేటర్లకు రానున్నాయి. బాబాయ్-అబ్బాయ్ సినిమాలు పరస్పరం క్లాష్ కాకుండా ప్లాన్ చేయడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు రిలీజ్ డేట్స్ ఫిక్స్ కావడంతో టాలీవుడ్ రిలీజ్ క్యాలెండర్‌కు స్పష్టత వచ్చింది. కానీ... అసలు ప్రశ్న ఇప్పుడు ఇదే చిరంజీవి 'విశ్వంభర' ఎప్పుడు?

షూటింగ్ పూర్తయినా.. ఆలస్యం ఎందుకు?
'బింబిసార' ఫేమ్ వశిష్టా దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వంభర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అయితే భారీ VFX వర్క్ కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోంది. తొలుత 2025 సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. 2024 నవంబర్‌లోనే షూటింగ్ దాదాపు 95 శాతం పూర్తైందని దర్శకుడు వెల్లడించినా... గ్రాఫిక్స్ పనులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మళ్లీ రీ-వర్క్ చేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో చిరంజీవి అనిల్ రావిపూడితో మన శంకర వర ప్రసాదు గారు పూర్తి చేసి, అది 2026 సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కానీ ఆ సినిమాకు ముందే పూర్తైన విశ్వంభర ఇంకా రిలీజ్ కాకపోవడం అభిమానుల్లో అసహనం పెంచుతోంది.
నిర్మాత క్లారిటీ
ఈ మధ్య ఓ మూవీ ఈవెంట్‌లో విశ్వంభర నిర్మాత యూవీ క్రియేషన్ తరఫున అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మొదటి టీజర్‌కు వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకున్నాం. రెండో టీజర్‌లో VFXని మెరుగుపరిచాం. విశ్వంభర చాలా పెద్ద సినిమా. గ్రాఫిక్స్ వర్క్ పూర్తయ్యాకే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. అభిమానులు కాస్త ఓపిక పట్టాలి'అని తెలిపారు. టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం... టీమ్ జూలై రెండో వారంలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా జూలై 9ని టార్గెట్ చేసినట్టు టాక్. అయితే అన్ని బిజినెస్ డీల్స్ క్లోజ్ అయితేనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మరింత ఆలస్యం అయితే అక్టోబర్‌కు వాయిదా పడే ఛాన్స్ కూడా ఉందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
భారీ క్యాస్ట్ - భారీ బడ్జెట్
ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష, అషికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి పట్నాయక్,మౌని రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు.మొదట అనుకున్న బడ్జెట్ సుమారు రూ.150 కోట్లు కాగా... VFX రీ-వర్క్ కారణంగా ఖర్చు దాదాపు రెట్టింపు అయినట్టు ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాల రిలీజ్ డేట్స్ క్లియర్ కావడంతో... మెగా అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఒక్క విశ్వంభరపైనే. చిరంజీవి కూడా ఈ సినిమాను సమ్మర్‌లో తప్పకుండా తీసుకొస్తానని మాట ఇచ్చిన నేపథ్యంలో, త్వరలోనే అధికారిక రిలీజ్ డేట్ అనౌన్స్ అవుతుందనే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











