చిరంజీవికి కోపం తెప్పించిన మ్యూజిక్ డైరెక్టర్.. పీకి పారేసిన మెగాస్టార్.. ఎవరాయన
మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయస్సు దాటినా ఇప్పటికీ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. యాక్షన్, డ్యాన్స్ లతోనూ దుమ్ములేపుతున్నారు. బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకుంటున్నారు. చివరిగా 'వాల్తేరు వీరయ్య' చిత్రంలో తన వింటేజ్ పెర్ఫామెన్స్ తో మెగా అభిమానులకు బాస్ ఫుల్ మీల్స్ అందించిన సంగతి తెలిసిందే. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఇతరులకు సాయం చేయడంలోనూ ఎంతో ముందుంటారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో తనతో కలిసి పనిచేసేందుకు ఎంతో మందికి అవకాశం అందించారు.. అందిస్తూనే ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ల వెంట పడకుండా తన అభిమానులకు డైరెక్షన్ ఛాన్స్ అందిస్తున్న సంగతి కూడా విధితమే. చివరిగా బాబీకి ఆ అవకాశం దక్కింది. నెక్ట్స్ చిరంజీవికి వీరాభిమానులైన బ్లాక్ బాస్టర్ హిట్స్ అందిస్తున్న అనిల్ రావిపూడి, మాస్ చిత్రాలతో దుమ్ములేపుతున్న శ్రీకాంత్ ఓదెలకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారని ప్రత్యేక చెప్పాలిన పనిలేదు. రీసెంట్ గానే అనిల్ రావిపూడితో సినిమా పూజా కార్యక్రమం కూడా పూర్తైంది. రేపో మాపో రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నారు. మరోవైపు శ్రీకాంత్ ఓదెలతోనూ సినిమా ప్రారంభించే పనిలో ఉన్నారు.

అయితే, చిరంజీవి ఇలా చాలా మందిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరోవైపు ఆయనపై ఎందరు ఎన్ని విమర్శలు, కావాలని ఆరోపణలు చేసినా పల్లెత్తి మాట కూడా అనరు. అలాంటింది తొలిసారిగా ఓ మ్యూజిక్ డైరెక్టర్ చిరంజీవికి కోపం తెప్పించాడంట. అదేదో వ్యక్తిగతమైన విషయం కాదు. సినిమా సంగీతానికి సంబంధించిన అవుట్ విషయంలో మెగాస్టార్ ను ఒప్పించలేకపోయాడంట. చాలా సమయం ఇచ్చినా సరిగా వినియోగించుకో లేకపోయాడంట. సినిమా విషయంలో ఎంతో నిబద్ధతగా ఉండే మెగాస్టార్ కూడా కాంప్రమైజ్ కాలేకపోయారంట.
ఫలితంగా ఆ మ్యూజిక్ డైరెక్టర్ ను తొలిగించారని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్. అయితే ఆయన మరెవరో కాదు. ప్రముఖ సంగీత దర్శకుడు హరీస్ జయరాజ్ కావడం ఆసక్తికరంగా మారింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. ఘర్షణ, అపరిచితుడు, గజిని, సైనికుడు, మున్నా, సెల్యూట్, సూర్య సన్నాఫ్ కృష్ణన్, వీడొక్కడే, ఘటికుడు, ఆరెంజ్, సెవెన్త్ సెన్స్, యముడు 3, స్పైడర్ వంటి సినిమాలకు ఎవర్ గ్రీన్ సాంగ్స్ ను అందించారు. కానీ ఆయన మెగాస్టార్ ను మాత్రం మెప్పించ లేకపోయారని తెలుస్తోంది. చిరంజీవినే కాకుండా సినిమా యూనిట్ మొత్తానికి ఆయన వర్క్ ఎంతో నచ్చలేదంట. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించినా మెగాస్టర్ తో కలిసి పనిచేయలేకపోయారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ స్టాలిన్ సమయంలో హరీశ్ జయరాజ్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం అందించారంట. కానీ ఆయన చిరంజీవికి ఓ విషయంలో కోపం తెప్పించారంట. దాంతో ఆ అవకాశం మణిశర్మకు ఇప్పించారంట. అయితే హరీశ్ జయరాజ్ కు ఇండస్ట్రీలో పలు సందర్భాల్లో ఇలానే జరుగుతుందని ప్రచారం. ఇక చిరంజీవి నెక్ట్స్ 'విశ్వంభర' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దసరా కానుకగా విడుదల కానుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











