Chiru 156: చిరంజీవి మూవీకి ఊహించని టైటిల్.. పేరులోనే పవర్ ఉందిగా!

గతంలో కంటే రీఎంట్రీ ఇచ్చిన తర్వాతనే వరుసగా సినిమాలు చేస్తూ రాకెట్ వేగంతో దూసుకుపోతోన్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. రెండేళ్లుగా ఏడాది రెండు చిత్రాలను అందిస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోన్న ఆయన.. తన 156వ సినిమా విషయంలో మాత్రం డైలమాలో పడ్డారు. ఈ పరిస్థితుల్లోనే ఇటీవలే దీన్ని అధికారికంగా ప్రకటించారు.

'భోళా శంకర్' చిత్రంతో భారీ డిజాస్టర్‌ను చవి చూసిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ స్టార్ హీరో 'బింబిసార' దర్శకుడు మల్లిడి వశిష్టతో ఓ సినిమాను చేయబోతున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని ఈ మూవీ పూజా కార్యక్రమాలను ఘనంగా జరుపుకున్నారు.

Viswambhara Title Fix For Chiranjeevi and Mallidi Vasishta Movie

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట తెరకెక్కించబోతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కాన్సెప్టు పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో పంచ భూతాలను చూపించి ఆసక్తిని పెంచేశారు. అదే సమయంలో ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతున్నట్లు కూడా పరోక్షంగా బయటపెట్టారు.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మాదిరిగా ఉండబోతుందని ప్రచారం జరుగుతూనే ఉంది. అంతేకాదు, హీరో మూడు లోకాలను చుట్టి వచ్చేలా వరం పొందుతాడని అంటున్నారు. అలా ఆయా లోకాలకు వెళ్లిన అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కబోతుందని ఇప్పటికే న్యూస్ వచ్చింది.

Viswambhara Title Fix For Chiranjeevi and Mallidi Vasishta Movie

టాలీవుడ్‌లోనే తొలిసారి డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందనున్న ఈ సినిమాకు 'ముల్లోక వీరుడు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ఇప్పటికే ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి 'విశ్వంభర' అనే టైటిల్‌ను ఫైనల్ చేసుకున్నారట. అన్ని భాషల్లోనూ అర్థం వచ్చే పేరు కావడంతోనే దీన్ని మూవీ యూనిట్ ఫిక్స్ చేసినట్లు తాజాగా తెలిసింది.

'విశ్వంభర' అనే టైటిల్‌లో పవర్‌ఫుల్ వైబ్ కనిపిస్తోంది. అందుకే చిరంజీవి సైతం దీనికి ఓకే చెప్పారని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా అనుష్క శెట్టిని తీసుకున్నారట. అలాగే, విలన్‌గా దగ్గుబాటి రానాను ఫైనల్ చేశారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X