కె.విశ్వనాధ్ కొత్త చిత్రంలో హీరోయిన్ గా ఆమె!?
ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాధ్ చిత్రంలో హీరోయిన్స్ కు ఉండే ప్రయారిటీ తెలిసిందే. ఇక తాజాగా ఆయన మరో సారి మెగాఫోన్ పట్టుకుంటున్న సందర్భంలో హీరోయిన్స్ సమస్య వచ్చిందని సమాచారం. అల్లరి నరేష్ హీరో కావటంతో అతని ప్రక్కన చేయటానికి అందరూ ఒప్పుకోవటం లేదు. మొదటగా కమల్ కూతురు శృతిహాసన్ ఈ చిత్రం కోసం విశ్వనాధ్ అడిగారు. అయితే ఆమె కమిట్ కాలేదు. అప్పటికీ కమల్ కల్పించుకుని..తనకీ,విశ్వనాధ్ కి ఉన్న రిలేషన్ గుర్తు చేసినా వర్కవుట్ కాలేదు. దాంతో విశ్వనాధ్ గారు కన్ను అనిల్ కపూర్ కూతురుపై పడింది. గతంలో హిందీ సాగరసంగమంలో అనిల్ కపూర్ చేసి ఉన్నారు. దాంతో ఆయన కుమార్తె సోనమ్ కపూర్ ని ఈ చిత్రం కోసం అడుగుతున్నారు. ఆమె ఒప్పుకుంటే ప్రాజెక్టుకు మరింత క్రేజ్ వచ్చినట్లే. ఇక మూడేళ్ళ విరామం తర్వాత విశ్వనాధ్ గారు డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని స్వరాభిషేకం నిర్మాత కౌసలేంద్రరావుగారే ప్రొడ్యూస్ చేయటం విశేషం. మరో కళాఖండం ఆవిష్కరణానికి ముహూర్తం దగ్గరపడిందన్నన్నమాట.


Click it and Unblock the Notifications











