నాగార్జున, నాని మల్టీస్టారర్‌కి షాకిచ్చిన వెండితెర పరిటాల రవి.. ఒక్క సారిగా!
Recommended Video

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. వివేక్ ఒబెరాయ్ రక్త చరిత్ర చిత్రంలో పరిటాల రవి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వివేక్ ఒబెరాయ్ హిందీ, తెలుగు, తమిళం అన్ని భాషలో విలన్ పాత్రలకు బ్రాండ్ గా మారిపోతున్నాడు. వివేక్ ఒబెరాయ్ కి మంచి డిమాండ్ ఉంది. దీనితో దర్శక నిర్మాతలు అతడిని తమ చిత్రాల్లో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలుగ, తమిళంలో
వివేక్ ఒబెరాయ్ ప్రస్తుతం సౌత్ లో నిర్మించబడుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో విలన్ పాత్రలు చేస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో వివేక్ విలన్. తమిళంలో అజిత్ విశ్వాసంలో కూడా ఇతడే విలన్ కావడం విశేషం.

దేవదాస్‌కు షాక్
వివేక్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అతడిని నాగార్జున, నాని మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ లో నటింప జేసేందుకు చిత్ర యూనిట్ ఇటీవల ప్రయత్నాలు జరిపిందట. కానీ వివేక్ డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ తో చిత్ర యూనిట్ షాక్ కి ట్గురైనట్లు తెలుస్తోంది.

భారీ డిమాండ్
దేవదాస్ చిత్రానికి వివేక్ ఒబెరాయ్ 2.5 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రాంచరణ్ చిత్రానికి వివేక్ ఒబెరాయ్ 1.25 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో దేవదాస్ చిత్ర యూనిట్ కంగుతిన్నట్లు తెలుస్తోంది.

వేరే నటుడితో
వివేక్ డిమాండ్ చేసిన పారితోషకం ఇవ్వలేక దేవదాస్ చిత్ర యూనిట్ మరో నటుడిని వెతుక్కునే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. వివేక్ కనీసం 1.5 కోట్ల వరకు బేరానికి వచ్చి ఉన్నా ఈ డీల్ కుదిరేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











