హాంగ్ కాంగ్ సినిమాకి కాపీనా?
{image-vn aditya_20052008.jpg telugu.filmibeat.com}పరిశ్రమ పుట్టిన నాటి నుండి మనవాళ్ళు హాలివుడ్ సినిమాలు ఫ్రీ మేక్ చేస్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు హాంకాంగ్, కొరియా సినిమాలపై కూడా మన దర్శకుల కన్ను పడుతోంది. ఆ మధ్య కొరియా సూపర్ హిట్ 'మై సాసి గర్ల్' సినిమాను 'మా ఇద్దరి మధ్య' అంటూ ఉన్నదున్నట్లు అనువాదం చేసి మన మీదకు వదిలారు. అలాగే దక్షిణ కొరియా చిత్రం 'మిస్టర్ సోక్రటీస్' సినిమాను 'ఖతర్నాక్' గా మరొకరు మనకందించారు. ఇప్పుడు మరో హాంకాంగ్ రొమాంటిక్ కామెడి 'పారా పారా సకురా' రూపం మార్చుకుని మన థియోటర్లోకి వస్తోంది. ఈ సారి సాహసం చేస్తోంది ఎవరో కాదు. కెరీర్ ప్రారంభంలోనే 'మనసంతా నువ్వే' వంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన వి.ఎన్.ఆదిత్య.
ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోంన్న 'రెయిన్ బో' చిత్రం 'పారా పారా సకురా' సినిమా ఆధారంగానే తీస్తున్నారంటూ ఫిల్మ్ నగర్ కోడై కూస్తోంది. 'హ్యాపీడేస్' ఫేం టైసన్ పాత్రధారి రాహుల్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో 'చందమామ' ఫేం సింధు మీనన్,సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు.కథ ప్రకారం ఇందులో హీరోకి కలర్ బ్లైండ్ నెస్ వస్తుంది. అతనికి ప్రపంచం అంతా బ్లాక్ అండ్ వైట్ గా కనిపిస్తుంది.కాని తను ప్రేమించే అమ్మాయి మాత్రం పింక్ కలర్ లో కనిపిస్తూ కామిడీ పండిస్తుంది. 'గుడంబా శంకర్' సినిమాని 'ఆట' గా మార్చి దొరికి పోయిన ఆదిత్య ఈ సారన్నా రెయిన్ బో కి కాపీ ఛాయలు కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్నారు తెలిసినవారు.


Click it and Unblock the Notifications











