వియన్ ఆదిత్య చిత్రం నెక్ట్స్ ఆ హీరోతోనా?
రొమాంటిక్ కామిడీలను పండించటంతో సిద్ద హస్తుడనిపించుకున్న వియన్ ఆదిత్య తదుపరి చిత్రాన్ని హీరో కమలాకర్ తో చేయనున్నారు. అభి చిత్రంతో పరిచయమైన హీరో కమలాకర్ తాజాగా హాసిని అనే చిత్రంలో చేస్తున్నారు. ఇక వియన్ ఆదిత్య ప్రస్తుతం..తనకు దర్శకుడుగా అవకాశమిచ్చిన ఎమ్.ఎస్.రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా ఓ చిత్రం చేస్తున్నారు. మిర్చి టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఎమ్.ఎస్.రాజు నిర్మించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రం ఓ మ్యూజికల్ రొమాంటిక్ కామిడీగా రూపొందనుందని సమాచారం. మనసంతా నువ్వే, ఆట తరహాలో రొమాన్స్, సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ కథ తయారు చేసారని చెప్తున్నారు. రెయిన్ బో చిత్రంతో వెనకబడ్డ ఆదిత్య ఈ చిత్రంతో నయినా మళ్ళీ క్రేజ్ తెచ్చుకుంటారని ఆశిద్దాం.
వియన్ ఆదిత్య మనసంతా నువ్వే ఆట బాస్ నేనున్నాను రెయిన్ బో దేవిశ్రీ ప్రసాద్ సుమంత్ అశ్విన్ manasantha nuvve aata boss nenunnanu rainbow devisri prasad kamalakar


Click it and Unblock the Notifications