హీరోయిన్ తో అసభ్య ప్రవర్తించాడనే...వి.యన్.ఆదిత్య
మనసంతా నువ్వే, నేనున్నాను, ఆట, బాస్ వంటి రొమాంటిక్ చిత్రాలతో పాపులర్ అయిన దర్శకుడు వియన్.ఆదిత్య. ఆయన తాజాగా చుక్కలాంటి అమ్మాయి..చక్కనైనే అబ్బాయి అనే చిత్రం నుంచి వైదొలిగారు. ఆ ప్లేస్ లోకి తమిళ దర్శకుడు కన్మణి వచ్చి చేరాడు. అయితే ఆ మార్పు వెనుక బలమైన కారణం ఉందని వియన్.ఆదిత్య బహిరంగంగానే చెప్తున్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ..నిర్మాత..హీరోయిన్ తో మిస్ బిహేవ్ చేయటంతో జరిగిన గొడవ ఫలితంగా ఆ ప్రాజెక్టును వదిలేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి ఆ తప్పును తనపై తొయ్యటానకి ప్రయత్నిచాడని ఆరోపించారని సమాచారం. ఇక ఇంతకు ముందు కూడా ఆదిత్య..నితిన్, ఇలియానా కాంబినేషన్ రెచ్చిపొ నుంచి తప్పుకున్నారు.అయితే అప్పుడు రెయిన్ బో చిత్రం ఫ్లాఫ్ ఎఫెక్టుతో ఆయన్ని తప్పించారని చెప్పుకున్నారు. ఇక చుక్కలాంటి అబ్బాయి..చక్కనైన అమ్మాయి చిత్రంలో తరుణ్ హీరోయిన్.


Click it and Unblock the Notifications











