twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి-వినాయక్ లు టాలీవుడ్ నెం.1-నెం.2 దర్శకులు..!?

    By Sindhu
    |

    టాలీవుడ్ నెంబర్ వన్, నెంబర్ టూ దర్శకులుగా, భావించే రాజమౌళి, వివి వినాయక్ ల మధ్య ఆధిపత్య పోరుకు 'బద్రినాథ్"తో బ్రేకులు పడ్డాయి. టాలీవుడ్ లో వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా.. ఈ ఇద్దరి సినిమాల్లో ఆక్షన్ సీక్వెన్స్, బ్యాక్ డ్రాప్ స్టోరీస్, హీరోల, విలన్ ల పవర్ ఫుల్ క్యారెక్టరైజన్ ఎవరికి వారు స్టాటి. అయితే ఇద్దరూ మాస్ సినిమాలను, హీరోయిజాన్నినమ్ముకొని ఈ పొజిషన్ కి చేరినా వీరి నేర్పరితనంలో మాత్రం ఆకాశానికి, భూమికున్నంత దూరం వుంది. కథ ఎన్నికలోనూ, సినిమాను నడిపే కథనంలోనూ రాజమౌళికున్నంత నాలెడ్జి వినాయక్ కి లేదని తేలిపోయింది..

    ప్రతి యాక్షన్ సీన్ కో, ప్రతి పాటకో ఏర్పరుచుకోవాల్సిన బలమైన ఎమోషన్ ని, లీడింగ్ సీన్ ని అల్లుకోవడంలో రాజమౌళికున్న కమాండ్ వినాయక్ లోని ఏ చిత్రంలోనూ అంత బలంగా కనిపించలేదు. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ ని, హీరోయిజాన్ని నమ్ముకుంటే అన్ని వేళలా వర్కవుట్ కాదేమో కానీ బలమైన ఎమోషన్ ని పండించగలిగితే సినిమా సక్సెస్ ట్రాక్ మీదే ఎల్లవేళలా నడుస్తుందని రాజమౌళి ప్రతి చిత్రం చెబుతుంది. అందుకే వినాయక్ కి రాజమౌళికి అసలు పోటియే కాదు పోలికే లేదంటున్నారు 'బద్రినాథ్" చూసిన కొందరు తెలివైన ప్రేక్షకులు..విమర్శకులు...

    English summary
    VV Vinayak can never compete with Rajamouli, VV Vinayak Badrinath turns Disaster. VV Vinayak Stoops down as Director.. One could easily identify the movies from Rajamouli and Vinayak just based on the action sequences and backdrops they use along with powerful characterizations of heroes and villains, which are altogether signature for both these directors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X