twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివి వినాయి క్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ చిత్రం టైటిల్ అదేనా?

    By Srikanya
    |

    ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ రీసెంట్ గా "చిలుక" టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేయించారు. దాంతో ఈ చిలుక టైటిల్ ఆయన తదుపరి చిత్రానకి పెట్టనున్నారని వినపడుతోంది. ప్రస్తుతం బధిరీనాధ్ షూటింగ్ లో బిజీగా ఉన్న వినాయిక్ ఆ తర్వాత పవన్ తో చేయటానకి కమిటయ్యారు. దాంతో పవన్ చిత్రానికి ఈ టైటిల్ పెడతారా అంటున్నారు. గతంలోనూ లక్ష్మి, కృష్ణ, వంటి సాదా సీదా టైటిల్ తో పెద్ద హిట్ సాధించిన వినాయిక్ ఈ టైటిల్ తోనూ అదే రేంజి సక్సెస్ ని అందుకుంటారంటున్నారు. మరో ప్రక్క ఈ మధ్యన ఆకుల శివ కథను వినాయిక్ ఓకే చేసాడని ఈ టైటిల్ దానికి సరిగ్గా సరిపోతుందని అంటున్నారు.

    డైరక్టర్ గా ఫెయిలయి తర్వాత లక్ష్మీ, కృష్ణ వంటి చిత్రాల ద్వారా రచయితగా ప్రూవ్ అయిన ఆకుల శివ ఈ పవన్ కళ్యాణ్ చిత్రానికి కథ ఇస్తున్నారని తెలుస్తోంది. వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిస్తారు. అలాగే ఈ చిత్రానికి 2011 మార్చి నుంచి పవన్ డేట్స్ ఇవ్వనున్నారు. ఇక పులి చిత్రం ప్లాప్ తర్వాత పవన్ వరసగా సినిమాలు కమిట్ అవ్వటానికి ఉత్సాహం చూపుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై జయంత్ దర్సకత్వంలో ఖుషీగా అనే చిత్రం చేస్తున్నారు. బాలీవుడ్ హిట్ లవ్ ఆజ్ కల్ కిది రీమేక్. పవన్ సరసన త్రిష ఈ చిత్రంలో చేస్తోంది. ఆయన తన తదుపరి చిత్రంగా వినాయిక్ చిత్రాన్ని ఓకే చేసారు. మరో ప్రక్క సింగీతం దర్శకత్వంలో రూపొందుతున్న క్రీస్తు చరిత్రలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పాత్ర వేస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X