నిజమా? :అఖిల్ దర్శకుడు ఖరారు
హైదరాబాద్: తన రెండో కుమారుడు అక్కినేని అఖిల్ ని లాంచ్ చేయటానికి నాగార్జున మొత్తానికి దర్శకుడు ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు రీసెంట్ గా బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ ని డైరక్ట్ చేసిన వివి వినాయిక్ అని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 20న అన్నపూర్ణ స్టూడియోలో భారీగా లాంచింగ్ జరుగుతోందని సమాచారం. ఈ మేరకు నాగార్జున, వినాయిక్ మధ్యన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
'మనం'లో తళుక్కున మెరిశాడు అఖిల్. ఆయన తెరపై కనిపించిన విధానం అభిమానులకే కాకుండా పరిశ్రమను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. మహేష్‌బాబు సైతం భవిష్యత్‌లో ఓ మంచి స్టార్‌గా అవతరిస్తాడని అఖిల్‌ని మెచ్చుకొన్నారు. తాజాగా అఖిల్ హీరోగా తెరంగేట్రం చేయబోయే సినిమాకి సంబంధించి ప్రయత్నాలు వూపందుకొన్నట్టు తెలుస్తోంది. అఖిల్ ట్విట్టర్ ద్వారా ఆ మధ్యన అభిప్రాయ సేకరణ చేపట్టారు.'తాను ఎలాంటి కథలో నటిస్తే బాగుంటుందో సలహా ఇవ్వండ'ని ట్వీట్ చేసి అడిగారు.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తే బాగుంటుందని కొందరంటే, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తే బాగుంటుందని మరికొందరు తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఇప్పటికే అఖిల్ రెండు మూడు కథల్ని ఎంపిక చేసుకునే వినాయిక్ తో కూర్చుని ఫైనల్ చేసాడనిసమాచారం. అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి సేకరించిన అభిప్రాయాల్ని విశ్లేషించి నిర్ణయం తీసుకున్న అఖిల్ అతి త్వరలోనే సినిమా ప్రకటించబోతున్నారని అంటున్నారు. బెస్టాఫ్ లక్ అఖిల్


Click it and Unblock the Notifications











