వివి వినాయక్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్?

By Bojja Kumar

హైదరాబాద్: ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్-వివి వినాయక్ కాంబినేషన్లో సినిమా రాలేదు. ఈ ఇద్దరి సినిమాలను ఇష్టపడే వారు ఈ కాంబినేషన్లో సినిమా చూడాలని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే వారి ఎదరు చూపులకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. వివి వినాయక్ స్టోరీ పవన్ కళ్యాణ్ ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేది తేలాల్సి ఉంది.

వివి వినాయక్ నెక్ట్స్ సినిమా వివరాలు...
న వివి వినాయక్ త్వరలో మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారు. ఆయన ఈ విషయాన్ని మీడియా ముఖంగా ప్రకటించారు. సొంత పనుల నిమిత్తం విశాఖ జిల్లా నక్కపల్లి వచ్చిన ఆయన మాట్లాడుతూ...వచ్చే ఏడాది మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లు తెలిపారు.

VV Vinayak to Direct Pawan Kalyan!

మరో ఇద్దరు పెద్ద హీరోలతో రెండు సినిమాలు ఉన్నాయని, వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని వినాయక్ తెలిపారు. ఈ రెండు సినిమాల్లో ఒకటి పవన్ కళ్యాణ్ సినిమా అని అంటున్నారు.

చిరంజీవి 150వ సినిమాకు ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, దర్శకుడు ఎవరో చిరంజీవిగారే స్వయంగా నిర్ణయిస్తారని వినాయక్ చెప్పుకొచ్చారు. అదే విధంగా ఎన్టీఆర్ తో అదుర్స్-2 చేయడానికి మంచి కథ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X