నిర్మాత కొడుకుని పరిచయం చేస్తూ వినాయిక్..
బెల్లంకొండ సురేష్ కుమారుడుని హీరోగా లాంచ్ చేయాలని చాలా కాలంగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ భాధ్యతని వివి వినాయిక్ భుజాన వేసుకున్నారు. అతని కోసం వినాయిక్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా బెల్లంకొండ సురేష్ ని కలిసిన వినాయిక్ ఈ మేరకు ఓ స్టోరీలైన్ చెప్పి ఒప్పించాడని చెప్పుకుంటున్నారు. మరో ప్రక్క ఎమ్ ఎస్ రాజు తన కుమారుడుని హీరోగా లాంచ్ చేస్తున్న సమయంలో చాలామంది నిర్మాతలు తమ కుమారులను కూడా హీరోగా ల్యాంచ్ చేసి హ్యాపీగా ఉందామనే నిర్ణయానికి వచ్చారు. వేరే ఎవరో హీరో మీద పెట్టుబడి పెట్టడం కన్నా తన కుమారుడునే హీరో చేస్తే బెస్ట్ అని డేట్స్ సమస్యలు అవీ ఉండవని, అల్లు అరవింద్, రామానాయుడు వంటి వారు అలా తమ కుమారులను హీరో చేసే ఏ ఇబ్బందీ లేకుండా ప్రొడక్షన్ చేసుకున్నారని భావిస్తున్నారు.
బెల్లంకొండ కుమారుడు ఇందుకోసం డైలీ జిమ్ కు వెళ్లటం, యాక్టింగ్ క్లాసులకు వెళ్లటం వంటివి చేసి ప్రిపేర్ అవుతన్నారు. ఇక వినాయిక్ ప్రస్తుతం రామ్ చరణ్ తో చేయబోయే చిత్రంపై పూర్తి దృష్టి పెట్టారు. ఆకుల శివ అందించే కధతో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. రామ్ చరణ్ తన రచ్చ చిత్రం పూర్తవగానే ఈ చిత్రం షూటింగ్ కి హాజరవుతారు.


Click it and Unblock the Notifications











