గోపి మోహన్‌కు రూ.కోటి ఆఫర్ ఇచ్చిన శ్రీను వైట్ల
సినీ పరిశ్రమలో డైరెక్టర్లు రాజమౌళి, పూరీ జగన్నాథ్, శ్రీనువైట్ల, వివి వినాయక్ ఇలా వీరంతా టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారంటే....సినిమా మొత్తాన్ని వీళ్లంతా ఒంటి చేత్తో నడిపిస్తారని కాదు. వాళ్లు నియమించుకున్న టెక్నీషియన్లు, అసిస్టెంట్లు పర్ఫెక్టుగా పని చేస్తేనే వీఃళ్లకి మంచి పేరొచ్చేది. అలాంటి వారిని మెయింటెన్ చేస్తున్నారు కాబట్టే వాళ్లు పరిశ్రమలో నిలదొక్కుకుంటున్నారనేది కాదనలేని సత్యం.
తాజాగా దూకుడు సినిమా ద్వారా సూపర్ హిట్ సాధించిన దర్శకుడు శ్రీను వైట్ల. పంచ్ డైలాగులకు, కామెడీకి, యాక్షన్ కి వైట్ల పెట్టింది పేరు. మరి శ్రీనుకు పంచ్ డైలాగులు రాసిన అసిస్టెంట్ గోపీమోహన్. ఇతను రాసిన డైలాగుల వల్లే దూకుడు దుమ్ము రేపుతోంది. శ్రీను వైట్ల కూడా డైలాగులు రాయగలడు. అయితే గోపీమోహన్ సహాయం లేకుండా చేయలేడు అనేది ఫిల్మ్ నగర్ టాక్. డైలాగ్ రైటర్లు ఎప్పటికీ రైటర్లుగానే ఉండరు కదా..వాళ్లకీ డైరెక్టన్ చేసే అవకాశం వస్తుంది. తాజాగా గోపీ మోహన్ కూడా అలాంటి అవకాశాలే వస్తున్నాయి. దీంతో శ్రీను వైట్ల టీం నుంచి బయటకు వచ్చి సొంతంగా సినిమాలకు డైరెక్షన్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.
అయితే గోపీ మోహన్ లాంటి టాలెంటెడ్ పర్సన్ ని వదులు కోవడం శ్రీను వైట్లకి ఇష్టం లేదు. ప్రస్తుతం శ్రీను వైట్ల చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అవి పూర్తయ్యే వరకు తన వద్దే ఉండాలని అతన్ని రాడని సమాచారం. ఇందుకోసం గోపీకి రూ. కోటి రెమ్యూనరేషన్ ఆఫర్ చేశాడట. అవి పూర్తయిన తర్వాత నీ ప్యూచర్ చూసుకోవాలని సూచించాడట. అయితే శ్రీను వైట్ల ఇచ్చిన ఆఫర్ ను గోపీ మోహన్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ''మీరు నాపై ఇంత నమ్మకంపెట్టుకున్నందుకు చాలా థాంక్స్. అయితే నాకు డైరెక్టర్ గా అవకాశం వచ్చినప్పుడే నన్ను నేను నిరూపించుకోవాలి"" అని సారీ చెప్పి..శ్రీను వైట్లకు దూరం కావాలనే నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ గుసగుస.


Click it and Unblock the Notifications











