మరో మెగా హీరోను లైన్ లో పెడుతున్న వాల్తేరు వీరయ్య డైరెక్టర్.. ఎవరితో అంటే..
కమర్షియల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు బాబీ ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య అనే సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకోవడమే కాకుండా దర్శకుడిగా అతని స్థాయిని కూడా పెంచింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఎప్పటి నుంచో పర్ఫెక్ట్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమా మళ్లీ పాత చిరంజీవిని అభిమానులకు ప్రజెంట్ చేసింది. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో వాల్తేరు వీరయ్య అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది.
ఇక ఆ సినిమాకు సంబంధించిన అనేక రకాల రికార్డులు మీడియాలో ఇప్పటికి వైరల్ అవుతున్నాయి. ఇక వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా దర్శకుడు బాబీకి ఇప్పుడు మరింత డిమాండ్ పెరిగింది. మరోసారి మైత్రి మూవీ మేకర్స్ ఇతనికి మంచి ఆఫర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని కథలపై మైత్రి నిర్మాతలతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం బాబీ మరో మెగా హీరోతోనే వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

మెగా హీరో వరుణ్ తేజ్ తో సినిమా చేయాలని చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. బాబీతో వరుణ్ తేజ్ గత రెండేళ్ల క్రితమే ఒక సినిమా చేయనున్నట్లు టాక్ వచ్చింది. కానీ కమర్షియల్ సినిమాల వైపు అంతగా ఆసక్తి చూపని వరుణ్ తేజ్ కొత్త తరహా కంటెంట్ తో ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేశాడు. అయితే ఇటీవల మెగాస్టార్ సలహా మేరకు వరుణ్ తేజ్ కు మరో కథను వినిపించగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయంలో ఇంకా ఎవరు అధికారికంగా అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఇక బాబీ లిస్టులో మరికొందరు అగ్ర హీరోలు కూడా ఉన్నారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











