War 2 Trailer: యాదృచ్ఛికం.. అటు ఎన్టీఆర్ కు, ఇటు హృతిక్ రోషన్ కు.. వార్ 2 ట్రైలర్ సీక్రెట్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ రాబోయే భారీ చిత్రం వార్ 2. ఈ చిత్రం కోసం అభిమానులతో పాటు నార్మల్ ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ హిందీ డెబ్యూ ఫిల్మ్ కావడం, మరోవైపు హృతిక్ రోషన్ తో జూనియర్ ఎన్టీఆర్ భారీ యుద్ధ సన్నివేశాల్లో నటించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. వచ్చే నెలలోనే ఈ చిత్రం విడుదల అవుతుండటంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను ప్రారంభించారు. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తూ ఉండటం విశేషం. ఇక తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను విడుదల చేయడంతో ఆసక్తికరమైన విషయం ప్రచారంలోకి వచ్చింది. ట్రైలర్ రిలీజ్ డేట్ వెనకాల ఉన్న సీక్రెట్ విషయానికొస్తే..
వార్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్..
భారీ స్పై యాక్షన్ ఫిల్మ్ వార్ 2కు సంబంధించిన టీజర్ ను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళంలో విడుదల చేశారు. మే 20న విడుదలైన ఈ టీజర్ కు అన్ని భాషల్లో కలిపి 70 మిలియన్ల వ్యూస్ దక్కడం విశేషం. ఇక ప్రస్తుతం వార్ 2కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జూలై 25 న ఈ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. మరో 3 రోజుల్లో ట్రైలర్ రాబోతుండటం విశేషంగా మారింది.

జూలై 25న ప్రత్యేకం..
వార్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ జూలై 25నే విడుదల చేయబోతుండటం వెనకాల ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అయితే 2025 జూలై 25 వరకు అటు గ్లోబల్ స్టార్, జూనియర్ ఎన్టీఆర్.. ఇటు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సినీ ప్రయాణం 25 ఏళ్లు పూర్తి కావడం విశేషంగా మారింది. దీని ప్రత్యేకంగానే జూలై 25న ట్రైలర్ ను విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇక ఎన్టీఆర్ తొలి చిత్రం నిన్ను చూడాలని 2001లో విడుదలైంది. హృతిక్ రోషన్ తొలి చిత్రం కహోనా ప్యార్ హై 2000లో విడుదలైంది. జూలై వరకు నెలల తేడాలో వీరిద్దరూ 25 ఏళ్ల కెరీయర్ ను పూర్తి చేసుకోవడం విశేషమని మేకర్స్ వెల్లడించారు.
భారీ బడ్జెట్ తో వార్ 2..
వార్ 2 చిత్రాన్ని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో స్టార్ కాస్ట్, టాప్ టెక్నీషియన్లు, ఇతర దేశాల్లో షూటింగ్స్ కారణంగా సినిమాకు భారీగానే ఖర్చు చేశారు. టోటల్ గా రూ.400 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండటం విశేషం. ఆగస్టు 14న వార్ 2 చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానుంది.
నెక్ట్స్ ఫిల్మ్స్..
వార్ 2 చిత్రం తర్వాత హృతిక్ రోషన్ బ్లాక్ బాస్టర్ ఫ్రాంచైజీ క్రిష్ 4ను రూపొందించే పనిలో ఉన్నారు. ఈ చిత్రాన్ని తన తండ్రి రాకేష్ రోషన్ నిర్మిస్తుండగా హృతిక్ రోషన్ డైరెక్టోరియల్ డెబ్యూ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ మరోవైపు ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రాలతో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











