War 2 Pre Release Event: వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్ .. ఎక్కడ? చీఫ్ గెస్ట్‌ ఎవరంటే?

గత కొద్దిరోజులుగా పెద్ద సినిమాలు లేక బాక్సాఫీస్ బోసిపోతోంది. కీలకమైన సమ్మర్ సీజన్‌లోనూ థియేటర్లు వెలవెలబోయయి. చాలా ఏరియాలలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. అయితే ప్రస్తుతం పెద్ద సినిమాలు బరిలో దిగుతుండటంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. జూలై 24న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల కాగా.. తర్వాత అందరి చూపు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2పై పడింది.

తారక్ బాలీవుడ్ ఎంట్రీ
తారక్ నటించిన బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఏ న్యూస్ అయినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వార్ 2 చిత్రంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తుండగా.. కియారా అద్వానీ హీరోయిన్‌. అషుతోష్ రాణా, అనిల్ కపూర్‌లు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

War 2 Pre Release Event Makers to planned Event in Vijayawada for Hrithik Roshan and Jr NTR s Film

వార్ 2 బడ్జట్ ఎంత?
బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్‌‌తో వార్ 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రాఫర్‌గా, ఆరిఫ్ షేక్‌ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రీతం సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారాలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14న వార్ 2 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

జూలై 25న వార్ 2 ట్రైలర్
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన టీజర్.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల పోరాట సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఎన్టీఆర్‌కు సంబంధించి సరైన ఎలివేషన్స్ లేవని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 25న వార్ 2 ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ ట్రైలర్ రిలీజ్ అవుతుందని మేకర్స్ తెలిపారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లు హీరోలుగా 25 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం కూడా జూలై 25నే వార్ 2 ట్రైలర్‌ను లాంచ్ చేయడానికి కారణమని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన దాదాపు 100 థియేటర్‌లలో వార్ 2 ట్రైలర్‌ స్క్రీనింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

బెజవాడలో భారీ ఈవెంట్
ఇదిలాఉండగా.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కూడా అప్పుడే డిస్కషన్స్ మొదలయ్యాయి. పాన్ ఇండియా చిత్రం కావడంతో ముంబైతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వార్2 ఈవెంట్స్ జరిగే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం భారీ ఈవెంట్ ప్లాన్ చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్ లేదా విజయవాడలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లన్ చేస్తున్నట్లుగా ఫిలింనగర్‌లో వార్తలు వస్తున్నాయి.

హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లను ఒకే వేదికపై చూస్తే ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోవడం గ్యారెంటీ అని అంటున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ఎవరు హాజరుకానున్నారు? అన్నది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. త్వరలోనే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం మాత్రం ఖాయంగా ఉంది.

More from Filmibeat

Read more about: war 2 hrithik roshan jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X