వార్ 2 డిజాస్టర్.. నాగవంశీ షాకింగ్ నిర్ణయం
సినీ పరిశ్రమలో 24 శాఖలకు చెందిన కార్మికులు, సంఘాలు భారీగా సమ్మెను కొనసాగిస్తున్నాయి. అయితే ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం పడుతున్న ఈ వ్యవహారాన్ని కూడా పట్టించుకోనంతగా నిర్మాత నాగవంశీ పరిస్థితి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నది. కింగ్డమ్, వార్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా పడటంతో ఆయన గురించిన చర్చ సోషల్ మీడియాలో కనిపిస్తున్నది. అయితే సినిమా హిట్, ఫ్లాపులు పట్టించుకోని నాగవంశీ తాజాగా మౌనం దాల్చడంపై అనేక రూమర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆయన మౌనం దాల్చిన నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వార్త గురించిన వివరాల్లోకి వెళితే..
చిన్న చిత్రాలు, కాన్సెప్ట్‌తో కూడిన యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌తో సందడి సందడిగా కనిపించే నిర్మాత నాగవంశీ స్పీడ్‌కు వార్ 2 సినిమా సడెన్ బ్రేక్ వేసింది. తాను భారీ అంచనాలు పెట్టుకొని కొనుగోలు చేసిన హిందీ డబ్బింగ్ మూవీకి ప్రేక్షకులు ఊహించని రీతిలో ముఖం చాటేశారు. దాంతో ఆయన జడ్డిమెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ చెల్లాచెదురైందనే మాట సోషల్ మీడియాలో ఘాటుగా వినిపిస్తున్నది.

వార్ 2 సినిమాను ఫ్యాన్సీ రేటు అంటే.. రికార్డు స్థాయిలో 90 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా ఓవరాల్ థియేట్రికల్ రన్‌లో కనీసం 50 కోట్ల గ్రాస్ కూడా రాబట్టే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపించడం లేదు. దాంతో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమా నాగవంశీకి సుమారుగా 50 కోట్ల రూపాయలు నష్టాన్ని తెచ్చి పెడుతుందని ట్రేడ్, సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అయితే వార్ 2 సినిమా రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలోను, అలాగే మీడియాకు పూర్తిగా కనిపించకుండా ఉన్నారు. సినిమా పరిస్థితి గురించి, త్వరలో రాబోతున్న తన సినిమా మాస్ జాతర గురించి కూడా మాట్లాడటానికి ఇష్టపడటం లేదని తెలుస్తున్నది. రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా ఆగస్టు చివరి వారంలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే నాగవంశీకి ఎదురైన పరిస్థితి నేపథ్యంలో ఆ మూవీ రిలీజ్ అవుతుందా? లేదా అనే విషయం భారీ చర్చకు దారి తీస్తున్నది.
సోషల్ మీడియాలో మీడియా వర్గాలు పెట్టిన పోస్టుల ప్రకారం.. వార్ 2 కొట్టిన భారీ దెబ్బకు కొద్ది రోజులు మీడియాకు, సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. ఇక ముందు ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్‌ను పూర్తిగా దూరం పెట్టాలని అనుకొంటున్నారు. ఇక త్వరలో రిలీజ్ కానున్న మాస్ జాతర రిలీజ్ వాయిదా వేసి.. వచ్చే నెలలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకొన్నారు అనే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
అయితే నాగవంశీ మౌనంగా ఉండటం వల్ల సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలకు భారీగా చోటు దక్కుతున్నది. ఇలాంటి రూమర్లపై ఆయన స్పందిస్తే తప్పా.. ఇలాంటి న్యూస్‌కు తెరపడే అవకాశం ఉంది. తన కెరీర్‌లో హిట్స్, ఫ్లాప్స్ కొత్తేమీ కాదు. ఆయన త్వరలోనే తనదైన శైలిలో స్పందిస్తారు. అంత వరకు కొంత ఓపిక పట్టండి అంటూ ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











