నెంబర్ వన్ స్థానం కోసం ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య కోల్డ్ వార్...
టాలీవుడ్ కి వచ్చి ఆరేళ్ళు దాటినా తెలుగు భాష పట్ల ఎప్పుడూ ఆసక్తి చూపని కాజల్, ఒక్కసారిగా ఇప్పుడు నెల రోజుల్లో తెలుగు నేర్చేసుకోవాలని తెగ ఆరాటపడిపోతోంది. షూటింగులో యూనిట్ వాళ్ళతో వచ్చీరాని తెలుగు మాట్లాడుతూ తెగ హడావిడి చేసేస్తోంది. ఇంతకీ దీనికి కారణం ఏమిటయ్యా అంటే…. తమన్నా తాజాగా "100% లవ్" సినిమాకి డబ్బింగ్ చెప్పడమేనట!
దీనికీ, దానికీ సంబంధం ఏమిటంటే, ఇప్పుడు కాజల్ కీ, తమన్నాకీ టాలీవుడ్ లో కోల్డ్ వార్ జరుగుతోంది. నెంబర్ వన్ స్థానం కోసం ప్రయత్నిస్తున్న తనకు తమన్నా రూపంలో పోటీ ఎదురైందని కాజల్ భావిస్తోంది. ఇప్పటికే పారితోషికం విషయంలో తనని దాటిపోయింది. దానికి తోడూ, డబ్బింగ్ కూడా చెప్పేస్తోంది. అందుకని వెంటనే తను ఎలేర్ట్ అవాలన్న ఉద్దేశంతో తెలుగు నేర్చుకుంటోంది… అంతేతప్ప, మన భాష మీద మమకారం వుండి కాదులెండి..!


Click it and Unblock the Notifications











